11 డెత్ కేసులో ట్విస్ట్ : ఆ ఇంటిని గుడిగా మార్చండి

burari-family-houseఢిల్లీలో బురారీ వీధిలో భాటియా కుటుంబంలోని మొత్తం 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రపంచం మొత్తం నివ్వెరపోతే.. ఇప్పుడు స్థానికులు కొత్త వాదన తీసుకొచ్చారు. మోక్షం కోసం.. దేవుడి దగ్గరకు వెళ్లిన ఆ ఇంటిని గుడిగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబంలోని అందరూ చనిపోయారు.. ఎవరూ లేవు.. దేవుడి కోసం ఇంత చేశారు.. ఇప్పుడు ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు.

నారాయణదేవి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటంతో ఆ భవనం ఇప్పుడు సీజ్ వేశారు. భవిష్యత్ లో ఆ ఇంట్లో ఎవరూ ఉండే అవకాశం కూడా లేదు. ఇంత పెద్ద ఘోరం జరిగిన తర్వాత దాన్ని ఎవరూ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఈ క్రమంలోనే వారి బంధువులు కూడా ఆలయంగా మార్చటానికి మద్దతు ఇస్తున్నారు. దేవుడిపై నమ్మకంతో.. మోక్షం కోసం వెళ్లిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అంటే.. దాన్ని ఆలయంగా మార్చి రోజూ పూజలు చేయాలని కోరుతున్నారు. అప్పుడే స్థానికులు కూడా ఆ ఘటనను మర్చిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. లేనిపక్షంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదో పాడుబడిన భవంతిగా మిగిలిపోతుందని.. చుట్టుపక్కల వారు భయపడే అవకాశం కూడా ఉంది అనేది స్థానికుల వాదన. స్థానికులు ఈ విషయాల నుంచి బయటకు రావాలంటే.. ఆ భవంతిని దేవాలయంగా మార్చితేనే మంచిదని కొందరు అధికారులు సైతం సూచిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy