115 బంతుల్లో 171 రన్స్: హర్మన్ బ్యాటింగ్ బీభత్సం

harman-preetఐసీసీ మహిళల ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకి భారత్ గట్టి సవాల్ విసిరింది. మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ 115 బంతుల్లో 171 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం కారణంగా కుదించిన 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు, కెప్టెన్ మిథాలీ విఫలమవడంతో ఒకానొక దశలో భారత్ కనీసం 200 పరుగుల మార్కు కూడా చేరుకోలేదేమో అనిపించింది. కానీ.. హర్మన్‌ప్రీత్ కౌర్  విజృంభించింది.

ఓపెనర్లు మంధానా (6), పూనమ్ రౌత్ (14) ఆదిలోనే పెవిలియన్ చేరిపోగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (36) రన్స్ తో క్రీజులో నిలిచినా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించలేకపోయింది. దీంతో భారత్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 101/3తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఈ దశలో దీప్తి శర్మ (25) తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన హర్మన్‌ప్రీత్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.

భారత్ చివరి 11 ఓవర్లలో ఏకంగా 139 పరుగులు రాబట్టి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఊహించని షాకిచ్చింది. ఆసీస్ బౌలర్లపై కౌర్ విరుచుకుపడుతుంటే అభిమానులు మురిసిపోయారు. మెన్స్ క్రికెటర్లలా భారీ సిక్సర్లు బాధుతుంటే ఎగిరి గంతులేశారు. ఆమె దూకుడైన బ్యాటింగ్ తో భారత మహిళల టీం ప్రపంచకప్ వన్డే ఫైనల్లోకి ప్రవేశించింది. 115 బంతుల్లో 20 ఫోర్లు, ఏడు సిక్సులతో 171 పరుగులు చేసింది హర్మన్ ప్రీత్ కౌర్. ఈ క్రమంలోనే కెరీర్ లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్న కౌర్ చివరి వరకు అజేయంగా నిలిచింది.

ఈ నెల 23న ఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్ తో తలపడనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy