12న రవ్వా శ్రీహరి రచనలపై సాహితీ సమాలోచనం

ravva srihariప్రముఖ సాహితీవేత్త, కుప్పం యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య రవ్వా శ్రీహరి పంచ సప్తతి మహోత్సవం సందర్భంగా ఆయన సమగ్ర రచనలపై ఈ నెల 12వ తేదీన సాహితీ సమాలోచనం నిర్వహించబోతున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగబోతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దీనిలో మొత్తం నాలుగు సదస్సులు జరుగుతాయి. రవ్వా శ్రీహరి సమగ్ర రచనలపై 29 మంది ఆచార్యులు వివిధ అంశాలపై పత్రాలను సమర్పించనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు అమరేశం రాజేశ్వరశర్మ, ప్రముఖ సాహితీవేత్త కోవెల సుప్రసన్నా చార్యులు, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్‌ పాల్గొననున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy