12 ఏళ్లలో అక్కడ 435 మంది జర్నలిస్టులు చనిపోయారు

journalistజర్నలిస్టు తనను తాను మరిచి.. ప్రపంచం కోసం పనిచేస్తుంటాడు. అక్కడి- ఇక్కడి వార్తలను సేకరించి జనానికి అందిస్తాడు. అన్యాయానికి గురైనవారికి గొంతుకై నిలుస్తాడు. అలాంటి జర్నలిస్టు చివరికి ప్రాణాలు కూడా అర్పిస్తాడు. ఇలా ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వాళ్లు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలమంది ఉన్నారు. ఇలా ఇరాక్ లో ఈ ఏడాది 29 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ జర్నలిస్టుల సంఘం ఈ వివరాలను వెల్లడించింది. దీంతో 2003 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్లలో 435 మంది చనిపోయారు. జర్నలిస్టుల కిడ్నాప్, వారిపై దాడులు లాంటి 43 కేసులు ఈ ఏడాది ఆ దేశంలో నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా కిడ్నాప్ కేసులున్నాయి. ఈ ఏడాది చనిపోయిన 29 మంది జర్నలిస్టులలో 20 మందిని ఐఎస్ టెర్రరిస్టులే అతి కిరాతకంగా చంపేశారు. మరో 9 మందిని మీడియా కవరేజ్ కోసం వెళ్లి అక్కడి దాడుల్లో చనిపోయారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy