13 కొత్త వర్శిటీలకు రూ.3,600 కోట్లు

దేశంలో మొత్తం 13 కేంద్ర వర్శిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ రూ.3,600 కోట్లు మంజూరు చేసింది. వచ్చే మూడేళ్లలో ఈ కొత్త వర్శిటీలు అమల్లోకి వస్తాయని అంచనా. సెంట్రల్‌ యూనివర్శిటీస్ చట్టం 2009 ప్రకారం ఏర్పాటవుతున్నాయి. బీహార్‌, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము,కశ్మీర్‌, జార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త వర్శిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ 11 రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటవుతాయి. జమ్ముకశ్మీర్‌లో మాత్రం రెండు కేంద్ర యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తోంది. క్యాంపస్ ల నిర్మాణం, అవసరమైన మౌలిక వనరుల ఏర్పాటుకు 3739.32 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ వర్శిటీలకు ఇప్పటికే కేబినెట్‌ 1474.65 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చింది. కేబినెట్‌ పర్మిషన్ మూడువేల కోట్లకు మించి ఖర్చయినా అందుకు అనుమతించింది. ఈ చర్యలతో ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు అవకాశముందని, ప్రామాణికాలు నిర్దేశించి ప్రాంతీయ అసమానతలను విద్యారంగంలో తొలగించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy