13 నుంచి హైదరాబాద్ ఫెస్ట్-2018

exhibitionనగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ ఫెస్ట్- 2018 నిర్వహించనున్నట్లు వెల్లడించింది జనవిజ్ఞాన వేదిక. ఈ సైన్స్ ఎగ్జిబిషన్‌ను స్టీఫెన్ హాకింగ్ సైన్స్ హబ్ పేరున నిర్వహిస్తుంది. మూడు విభాగాలుగా.. జేవీవీ ఎగ్జిబిషన్, స్కూల్ పిల్లల ఎగ్జిబిషన్, కాలేజీ విద్యార్థుల ఎగ్జిబిషన్(ఇంజినీరింగ్ మరియు మెడికల్) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సైన్స్ హబ్‌లో 42 నుంచి 54 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.స్కూల్, మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థుల ఎగ్జిబిషన్‌కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్, మరిన్ని వివరాల కోసం 9490300488, 9908246760 నెంబర్లకు సంప్రదించవచ్చు. ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్లు చేసుకోగలరు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy