14 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

exams-interఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. 819 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,20,549 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. వారిలో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం హాజరు కానున్న వారు 1,25,960 మంది ఉన్నట్లు తెలిపారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 8,420 మంది ఇన్విజిలేటర్లను, 819 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను, 819 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు…సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను 1:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 2:15 గంటలకల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో కూర్చోవాలన్నారు. పరీక్ష ప్రారంభ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగానే ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు అశోక్‌ తెలిపారు. అలాగే ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షలను ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరుగుతుందన్నారు.

 పరీక్షల షెడ్యూల్:

తేదీ                              ఫస్ట్ ఇయర్                               సెకండ్ ఇయర్

14-05-2018                సెకండ్ లాంగ్వేజ్-1                    సెకండ్ లాంగ్వేజ్-1

15-05-2018                ఇంగ్లిష్-2                                   ఇంగ్లిష్-2

16-05-2018               గణితం-1A, బోటనీ-1                  గణితం-1A, బోటనీ-1

సివిక్స్-1,సైకాలజీ-1                     సివిక్స్-2,సైకాలజీ-2

17-05-2018             గణితం-1B,జువాలజీ-1, హిస్టరీ-1        గణితం-2B,జువాలజీ-2,హిస్టరీ-2

18-05-2018              ఫిజిక్స్-1,ఎకనామిక్స్-1                ఫిజిక్స్-2,ఎకనామిక్స్-2

క్లాసికల్ లాంగ్వేజ్-1                           క్లాసికల్ లాంగ్వేజ్-2

19-05-2018             కెమిస్ట్రీ-1, కామర్స్-1                          కెమిస్ట్రీ-2, కామర్స్-2

సోషియాలజీ-1,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్-1   సోషియాలజీ-2,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్-2

21-05-2018      జియాలజీ-1,హోమ్ సైన్స్-1                 జియాలజీ-12,హోమ్ సైన్స్-2

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్-1                పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్-2

బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-1(బైపీసీ)                  బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-2(బైపీసీ)

22-05-2018      మోడ్రన్ లాంగ్వేజ్-1,జాగ్రఫీ-1                మోడ్రన్ లాంగ్వేజ్-2,జాగ్రఫీ-2

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy