15 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించిన సుబ్బరాజు

subbaraju-1024x658డ్రగ్స్ కేసులో సంచలనం రేపే కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్న ఇద్దరు ప్రముఖ నిర్మాతల కుమారులు (ఇద్దరూ ప్రముఖ హీరోలు కూడా), సినీరంగంలో సీనియర్ నటుడిగా ఉన్న మాజీ హీరో కుమార్తె, ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ డ్రగ్స్ వాడుతుంటారని క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు సిట్ అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తున్నది.  దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రమాదకరమైన డ్రగ్స్ ను థాయిలాండ్ నుంచి పెద్ద మొత్తంలో నగరానికి తెప్పించి సినీ పరిశ్రమను మత్తులో ముంచుతున్న విషయాన్ని సుబ్బరాజు చెప్పడంతో ఫిలింనగర్ షేక్ అవుతోంది.  టాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంపై సిట్ జరుపుతున్న విచారణకు క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు శుక్రవారం(జూలై 21)  హాజరయ్యారు. ఉదయం 9.40 గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన సుబ్బరాజు విచారణ 10.15 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం తర్వాత 1.30 గంటలకు మళ్లీ రెండో దఫా విచారణ మొదలుపెట్టారు. చివరకు రాత్రి 11.20 గంటలకు సుబ్బరాజు విచారణ ముగించుకుని బయటకు వచ్చారు. దాదాపు పన్నెండున్నర గంటలపాటు సాగిన సుదీర్ఘ విచారణలో సంచలనాత్మక అంశాలను సుబ్బరాజు వెల్లడించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయినవారి ఖాతాలను సీజ్ చేయాలని బ్యాంకర్లను సిట్ అధికారులు కోరారు. బిట్‌కాయిన్స్ ఎక్సేంజ్‌ను కూడా అడ్డుకోవాలని ఎన్సీబీని సిట్ కోరినట్టు తెలుస్తున్నది.

డ్రగ్స్ మూలాలను వెలికితీయాల్సిందే: సుబ్బరాజు

విచారణ ముగించుకుని బయటకు వచ్చిన సుబ్బరాజు.. అక్కడే ఉన్న మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. డ్రగ్స్ మూలాలను వెలికితీసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. చిన్న పిల్లలకు సైతం డ్రగ్స్ అలవాటుచేయడం బాధాకరంగా ఉందని చెప్పారు. ఇలాంటి వార్తలు వింటేనే ఒక విధంగా తనకు ఏడుపు వస్తుందని అన్నారు. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా వారి ముందు హాజరవుతానని చెప్పారు.

నేడు సినీహీరో తరుణ్ వంతు

సినీహీరో తరుణ్ శనివారం(జూలై 22) సిట్ విచారణకు హాజరుకానున్నారు. తరుణ్ విచారణ సమయంలో ఎైక్సెజ్ కార్యాలయం వద్ద తగిన భద్రతాఏర్పాట్లు చేయాలని ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈడీ అకున్ సబర్వాల్ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy