150 మంది మహిళలకు ఎయిడ్స్ అంటించాడు

auto jamesజల్సాలే జీవితం అనుకున్నాడు. కానీ ఆ జల్సాలే ప్రస్తుతం అతని ప్రాణాలకు ముప్పుగా మారాయి. చేసుకున్న మూడు పెండ్లిండ్లు బెడిసికొట్టాయి. సంసారం చేయలేక ముగ్గురు భార్యలు విడిచిపెట్టారు. ఒంటరిగా ఉన్న అతను సైకోగా మారాడు. శాడిజం కూడా పెరిగింది. తీరా పోలీసులకు చిక్కడంతో .. సైకో అసలు స్వరూపం బయటపడింది.

 

 

అన్ని దురలవాట్లే

మెట్టుగూడకు చెందిన జోసెఫ్ జేమ్స్ కు ..మొదటి నుంచి గ్యాబ్లింగ్ అతని అలవాటు.  మందు తాగడం, వ్యభిచార గృహాలకు వెళ్ళడం లాంటి మనోడి రొటీన్ డ్యూటీ. మందుకు బాసిసయ్యాడు …మట్కాకింగ్ గా కూడా అవతారమెత్తాడు. సంపాదించిన వేల రూపాయలు.. వ్యసనాలకు ఖర్చు చేసేవాడు.డబ్బులు కావాల్సి వస్తే ఇళ్ల చోరీలు చేశాడు. అంతేకాదు.. ఆటో ఎక్కే మహిళలను కూడా టార్గెట్ చేశాడు. తనమాటలతో.. వ్యవహారంతో లోబరుచుకునే వాడు. డబ్బులు తీసుకునేవాడు.. ఇంకా లొంగిపోతే తనరోగాన్ని అంటించేవాడు.

ఇవన్నీ ఎలా సాధ్యం

జేమ్స్.. ఆటో డ్రైవరే కాదు.. అనర్గళంగా ఇంగ్లీష్ లో దంచేస్తాడు. పోష్ గా.. గళగళ మాట్లాడే మనోడి తీరుకు కొందరు మహిళలు అయితే ఆటో డ్రైవర్ ను అని నిజం చెప్పినా నమ్మేవారు కాదు. ఇలా చాలా మంది మహిళలకు బురిడీ కూడా కొట్టించాడు. తను సరదా కోసం.. కోరకతో ఆటో నడుపుతున్నాను అని ఆటోలో ఎక్కే మహిళలను బట్టి చెబుతుండేవాడు.

ఫోన్ లో 150 మంది మహిళల నెంబర్స్

150 మంది మహిళలు మనోడి లిస్ట్ లో ఉండటం పోలీసులను సైతం ఆశ్చర్య పరిచింది. అనుమానంతో కొందరికి ఫోన్ చేస్తే.. లేడీస్ వాయిస్ వినిపించింది. నిగ్గదీసి అడిగితే అవును.. 150 మంది మహిళలతో సంబంధం ఉందని కుండబద్దలు కొట్టాడు. ఒంటరిగా ఉండే మహిళలే టార్గెట్ అని చెప్పాడు. తను మాట్లాడే ఇంగ్లీష్.. ప్రవర్తనతో.. మాయమాటలతో బురిడీ కొట్టించేవాడినని చెప్పుకొచ్చాడు. జల్సాలకు బానిసై.. ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డాడు. తనకున్న రోగాన్ని కొంతమంది మహిళలకు అయినా అంటగట్టేందుకు.. శాడిస్టు అవతారమెత్తాడు. వ్యభిచార గృహాలకు వెళ్లినప్పుడు ఎలాంటి రక్షణ జాగ్రత్తలు తీసుకునేవాడు కాదు.

జేమ్స్ ఎలా దొరికాడు

జల్సాలకు డబ్బులన్నీ అయిపోయాయి. వచ్చే సంపాదన, బ్యాలెన్స్ మొత్తం హరీ అయ్యింది. దీంతో దొంగతనాలు మొదలుపెట్టాడు. తన స్నేహితుడి ఇంట్లో.. ఐదు తులాల బంగారం దొంగతనం చేశాడు. ఈ కంప్లయింట్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు జేమ్స్ దొరికాడు. తీగ లాగితే పులిరాజా వ్యవహారాలు మొత్తం బయటపడ్డాయి. పోలీసులు షాక్ అయ్యారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy