16వ గది చూపిస్తే.. రాజీనామా చేస్తా : సీఎం కేసీఆర్

pragathi-bhavan-రడిసీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్ పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోం అన్నారు. ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్లీనర్ అయిపోయిన వెంటనే అక్కడికే వెళతానని.. సాయంత్రం ఏఢు గంటలకు ప్రగతి భవన్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే మొత్తం చూపిస్తా అన్నారు. 16వ గది చూపిస్తే అప్పుడే రాజీనామా చేస్తాను అంటూ సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. 15 గదుల కంటే ఎక్కువ చూపించకపోతే ప్రగతి భవన్ ఎదుటే.. ఉత్తమ్ ముక్కుకు నేలకి రాస్తాడా అని ఛాలెంజ్ విసిరారు సీఎం కేసీఆర్. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అబద్దాలతో ప్రజలను మోసం చేయలేరన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy