16 నుంచి ‘మన నగరం’ కార్యక్రమం : కేటీఆర్

KTRచెత్తను నివారించుకున్నట్లైతే హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తయారుచేసుకోవడమే కాకుండా..రోగాల బారి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లమవుతామన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో చెత్తసేకరణ కోసం మంగళవారం (డిసెంబర్-12)న 20 వాహనాలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. సేకరించిన వ్యర్థాలను ఉపయోగించి, ఫుట్ పాత్ లను నిర్మించవచ్చని..ఇందుకోసం జీడిమెట్లలో 15 ఎకరాలతో ఓ యూనిట్ ను GHMC  ఏర్పాటు చేసిందన్నారు. టోక్యోలో ఎక్కడ చూసినా చెత్త కనపడదని, అక్కడ పర్యటనలో ఉన్నప్పుడు దీనిపై అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు కేటీఆర్.

చెత్తకు సంబధించి 5వేల టన్నుల వరకు ఇప్పటికే చెరుతుందని, అధునాతనమైన పద్ధతులతో దీన్ని డంపింగ్ యార్డులకు చేరుస్తున్నామన్నారు. ఆరోగ్యపరంగా మస్కిటో యాప్ ను తీసుకువచ్చినట్లు చెప్పారు. పురపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ‘మన నగరం’ అనే పేరుతో ఈ నెల 16వ తేదీనుంచి ఖుత్బుల్లాపూర్ లో ప్రారంభించుతామన్నారు. ఈ మూడేళ్లలో నగరం గణనీయంగా మొరుగుపడిందన్న కేటీఆర్.. వాటర్, కరెంట్, రోడ్లు, ట్రాఫిక్, మెట్రో లాంటి  విప్లవాత్మకమైన అభివృద్ధి జరిగిందన్నారు.

లక్ష డబుల్ బెడ్ రూమ్స్  పూర్తి చేస్తున్నామని, దేశంలోనే అన్ని రంగాల్లో హైదరాబాద్ ముందుండేలా మన నగరాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రజా రవాణా మరింత మెరుగుపరుస్తామని, కాలుష్యాన్ని తగ్గించేందుకే త్వరలోనే మెట్రోను పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy