17న టాక్సీవాలాతో వస్తున్నా : విజయ్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇవాళ (నవంబర్-08)న సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ప్రేమోషన్స్ లో కొత్తగా ట్రై చేసే విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్ కూడా కాస్త వెరైటీగా చేస్తున్నాడు. గీత గోవిందం సినిమాకు నెటిజన్ల ట్రోల్స్ తో ఫీడ్ బ్యాక్ తీసుకుని ..సినిమాకు ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు టాక్సీవాలా రిలీజ్ ఆలస్యంపై వివరణ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశాడు విజయ్. సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కాస్త లేటయ్యిందని చెప్పుకొచ్చాడు. సినిమా సొషియో ఫాంటసి ఉంటుందని. .17న థియేటర్స్ లో కలుద్దామని ట్వీట్ చేశాడు. సంకృత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సరసన ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy