17 ఏళ్ల తర్వాత లంకేయులు గెలిచారు..

ConTQhTWYAAegq4పల్లెకెలె టెస్టులో జయభేరి మోగించింది శ్రీలంక. ఆస్ట్రేలియాపై 106 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు లంకేయులు. 17ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది లంక. ఓవర్‌నైట్‌ స్కోరు 83/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (55) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. శ్రీలంక విజయంలో స్పిన్నర్‌ హెరాత్‌ (5/54)  కీలక పాత్ర పోషించాడు. అంతక ముందు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌటై నిరాశపరిచిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కుశాల్‌ మెండిస్‌ (176) శతకం బాదడంతో 353 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసి 86 పరుగుల ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శ్రీలంక స్పిన్నర్ల ధాటికి నిలవలేక చేతులెత్తేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy