18 ఏళ్లుగా సీసీఐ కోసం పోరాటం

cci_adilabadఆదిలాబాద్ జిల్లాలోని  CCI ఫ్యాక్టరీ  రీ ఓపెనింగ్ అంశం  మళ్లీ తెరపైకి వచ్చింది. 18 ఏళ్లుగా పోరాడుతున్న కార్మికులు.. ఫ్యాక్టరీని తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. CCI ని  ఓపెన్ చేస్తే  ఉపాధి పెరగడంతో పాటు.. జిల్లా అభివృద్ధి  వేగంగా జరుగుతుందంటున్నారు.

రీ ఓపెనింగ్ పై కార్మికుల్లో ఆశలు

ఆదిలాబాద్ జిల్లాలో మూతబడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. రీ ఓపెనింగ్ పై కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుండటంతో.. ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని భావిస్తున్నారు కార్మికులు. 18 ఏళ్లుగా సీసీఐని రీఓపెన్ చేయాలని కార్మికులు, ట్రేడ్ యూనియన్ నేతలు గత ప్రభుత్వాలకు విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు. సొంత రాష్ట్రంలోనైనా ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంటుందని ఎదురుచూస్తున్నారు కార్మికులు.

1982 ఆగస్టు 15న సిమెంట్ ఉత్పత్తి ప్రారంభం

60 కోట్లతో ఏర్పాటు చేసిన సిమెంట్ కార్పొరేషన్ లో 1982 ఆగస్టు 15న సిమెంట్ ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పట్లో 4వేల మందికి ఉపాధి కల్పించారు. 1991 వరకు ఇక్కడ ఉత్పత్తి కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రకు ఇక్కడి నుంచే సిమెంట్ సరఫరా అయ్యేది. 1991లో పీవీ నర్సింహారావు ప్రవేశపెట్టిన కొత్త పారిశ్రామిక ఆర్థిక విధానాలతో వేల కోట్ల లాభాలు పొందింది.

1998 అక్టోబర్ లో నిలిచినపోయిన ఉత్పత్తి

సీసీఐకి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోవడంతో… 1998 అక్టోబర్ నెలలో పూర్తిగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోయింది. అప్పటి నుంచి కార్మికులు పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తే చాలా లాభాలున్నాయి. సీసీ రోడ్లు వేయాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణలోకి వస్తే.. ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేసే సిమెంట్ ను.. సీసీఐ ద్వారా సరఫరా చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఇక్కడి నుంచి  సిమెంట్ సరఫరా చేయటంతో పాటు.. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చంటున్నారు కార్మికులు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.