18 ఏళ్ల తర్వాత మాధురితో అనిల్ కపూర్

anilఅలనాటి రొమాంటిక్ పెయిర్ అనిల్‌కపూర్-మాధురీదీక్షిత్ జంట.. మళ్లీ వెండితెరపై హంగామా చేయనుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్‌ని తెరపైకి తీసుకొచ్చాడు బాలీవుడ్ డైరెక్టర్ ఇంద్రకుమార్. ‘టోట‌ల్ డమాల్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 14 నుంచి కొనసాగుతోంది. తాజాగా అనిల్‌క‌పూర్- మాధురీల ఫోటో ఒక‌టి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. మాధురీ భుజంపై రెండు చేతులు వేసి డిఫ‌రెంట్ పోజులిచ్చాడు అనిల్‌క‌పూర్‌. కామెడీ యాంగిల్‌లో ఈ ప్రాజెక్ట్‌ని తెర‌కెక్కిస్తున్నట్టు ముంబై సమాచారం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy