19న తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

weather-changesమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ఫపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం మరింత బలపడి వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 19 నాటికి  ఉత్తరాంధ్ర ,దక్షిణ ఒరిస్సా ల మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తోంది వాతావరణ విభాగం. వాయు గుండం ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లను హెచ్చరించింది వాతావరణ విభాగం. అల్ఫపీడనం బలపడి వాయుగుండంగా మారే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. గాలుల తీవ్రత వలన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. అధికారులు అప్రమత్తంగా వుంటూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూసే ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైతే అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలుత బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర కోస్తా వైపు ప్రయాణిస్తుందని వాతావరణ విభాగం అంచనా వేసింది అయితే అల్ఫపీడనం  తన దిశను మార్చుకుని ఒరిస్సా వైపు కదులుతోందని సోమవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావం వలన ఈ నెల 18, 19 ,20 తేదీల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని మత్య్సకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy