19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

asseఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.40 నిమిషాలకు సమావేశాలు బిగిన్ అవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగే ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి. ఇక ప్రొటెం స్పీకర్ గా పి.నారాయణ స్వామి ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 19న జరిగే అసెంబ్లీ సమావేశం రోజునే సీఎం, మంత్రులతో సహా ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 20న జరగనుంది. అదే రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. 21న ఉభయ సభలను ఉద్ద్యేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఇక 23, 24న గవర్నర్ ప్రసంగం గురించి ధన్యవాదాల తీర్మానం, గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy