1970 లో. . .రాష్ట్రపతి ‘పాలన’లు

images (4)
మన దేశంలో 1970వ దశాబ్డానికి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం భారత దేశ రాజకీయ అంశాలకు ఈ కాలానికి ఉన్న సంబంధం చాలా బలమైంది. దీని గురించి ఇప్పటి వారికి అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ ఆ తరానికి మాత్రం అనుభవంలోనే ఉంటుంది. దేశ స్థితి గతులు ఆ కాలానికే నిదర్శనం అని అనుకోవచ్చు. ఇంతకు ఈ దశాబ్దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?

రాష్ట్రపతి పాలన అనగానే ముందుగా అయిష్టంగా ఉండేది మాత్రం రాజకీయ నాయకులే. ఎందుకంటే వారి ప్రమేయం లేకుండానే ప్రభుత్వం నడుస్తుంది. ప్రజల నుంచి కూడా రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకత వస్తుంది. దేశంలో రాజకీయ పరిస్థితులు 1970లో ఏ స్థాయిలో ఉండేవంటే రాష్ట్రపతి పాలనే దానికి ఉదాహరణ. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. జనతా ప్రభుత్వం కొంతకాలం ఉన్నది. దీన్నో సంక్షోభ కాలంగా చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టిన దశాబ్ధం ఏదైనా ఉందంటే అది 1970 ఏడాదే.

దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలూ రాష్ట్రపతి పాలనను చవి చూశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1973లో రాష్ట్రపతి పాలన చూసింది. అప్పడు ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండేవారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో 1979, బీహార్ లో 1972, 1977 కాలంలో రెండు సార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ఇక గోవాలో 1979లో పెట్టారు. గుజరాత్ లో 1971, 1974, 1976 కాలంలో రాష్ట్రపతి పాలన విధించారు. హర్యానా రాష్ట్రానికి కూడా 1977లో రాష్ట్రపతి పాలన వచ్చింది.

హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లో 1977 టైంలో రాష్ట్రపతి పాలన పెట్టారు. కర్నాటక రాష్ట్రంలో 1971, 1977లో రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కేరళలో 1970, 1979లో పెట్టారు. మణిపూర్ లో 1973, 1977, 1979 లలో పెట్టారు. మిజోరాంలో 1977, 1978లలో పెట్టారు. ఒడిషా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన విధించారు.

1970 దశాబ్దం మాత్రం రాష్ట్రపతి పాలన పెట్టిన అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. రాష్ట్రపతి, పార్లమెంట్ ఉండే ఢిల్లీ రాష్ట్రానికి మాత్రం ఈ ఏడాదే రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇదే ఢిల్లీ రాష్ట్రానికి మొదటి రాష్ట్రపతి పాలన.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy