1971 వార్ హీరో – నికార్సైన దేశభక్తుడు

jfr-jacob-v6 newsఇండియన్ గ్రేట్ వారియర్ జాకబ్ కు కడసారి వీడ్కోలు పలికాయి త్రివిధ దళాలు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, సీనియర్ నాయకులు జాకబ్ భౌతికకాయం దగ్గర పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ఇజ్రాయిల్ రాయబారితో పాటు.. పలు దేశాల ఆర్మీ అధికారులు పై కూడా జాకబ్ కు నివాళులర్పించారు.

 

 

1971 వార్ హీరో జాకబ్

1971 ఇండో-పాక్ యుద్దంలో… భారత్ గెలుపునకు  బాటలు వేసిన గ్రేట్ వారియర్  J.F.R  జాకబ్. గురువారం తుదిశ్వాస విడిచారు రిటైర్డ్ లెఫ్టినెంట్  జనరల్ జాకబ్. 92ఏళ్ల జాకబ్… ఆర్మీ నుంచి రిటరైన తర్వాత… గోవా, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను జనవరి 1న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. నిమోనియాతో బాధపడుతూ… తుదిశ్వాస విడిచారు. 1971 యుద్ధంలో పాక్ దళాలు ఢాకాలో లొంగిపోవడంలో కీలకపాత్ర పోషించిన వారిలో జాకబ్ ప్రసిద్ధులు.

jfr-jacob-mos

1923లో కోల్ కతాలో పుట్టారు జాకబ్. 1942లో బ్రిటీష్ ఇండియా ఆర్మీలో చేరారు. రెండో ప్రపంచ యుద్దంలోనూ పాల్గొన్నారు. యుద్ధంలో భాగంగా… ఇరాక్, ఉత్తర ఆఫ్రికా, బర్మా, సుమత్రాల్లో పోరాడారు. యుద్ధం తర్వాత… ఇంగ్లాండ్, అమెరికాల్లోని అర్టిల్లరీ స్కూల్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. దేశ విభజన తర్వాత… ఇండియన్ ఆర్మీలో చేరారు. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో జాకబ్… ఈస్ట్రన్ కమాండ్ కు కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఉన్నారు.

 

 

రెండు రాష్ట్రాల గవర్నర్

1978లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు జాకబ్. 1990ల్లో బీజేపీలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. చాలా ఏళ్ల పాటు ఆ పార్టీ సెక్యూరిటీ అడ్వైజర్ గా సేవలందించారు. 1998 ఏప్రిల్ 19న గోవా గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. 1999 నవంబర్ 26వరకు గోవా గవర్నర్ గా పనిచేశారు. 1999 నవంబర్ 27న పంజాబ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2003 మే8 వరకు ఆ పదవిలో ఉన్నారు. జాకబ్ మృతికి ప్రధాని నరేంద్రమోడీ, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్  సంతాపం తెలిపారు. ఆయన అందించిన నిరుపమాన సేవలకు దేశం రుణపడి ఉంటుందని మోడీ ట్వీట్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy