2 వేలకే సెల్‌కాన్ స్మార్ట్ ఫోన్

Celkon-A119Qమొబైల్ ఫోన్ల కంపెనీలు పోటీ పడి మరీ తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ కేవలం రూ.2 వేలకే స్మార్ట్ ఫోన్ ను ఇవ్వనుంది. ‘క్యాంపస్ నోవా ఏ352ఈ’ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పని చేస్తుంది. ఇందులో ఒపేరా మినీ మొబైల్ బ్రౌజర్‌ను ప్రీ ఇన్‌స్టాల్ చేశారు. ఇందుకోసం ఒపేరా సాఫ్ట్‌వేర్‌తో సెల్‌కాన్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లో 3.5 ఇంచుల స్క్రీన్, 512 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2 ఎంపీ కెమెరా, జీపీఆర్‌ఎస్, వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో స్నాప్‌డీల్ లో మాత్రమే దొరుకుతుంది. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా అన్ని మొబైల్ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొస్తామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు అన్నారు. దీనితో పాటు దీపావళికి విండోస్ ఫోన్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ ఫోన్ 4 ఇంచుల స్క్రీన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీతో…రూ.6 వేలలోపు ధరకే అందిస్తామని అన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy