20 ఏళ్లలో వంద స్మార్ట్ సిటీలు

images (15)అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీ లను డెవలప్ చేస్తామని ప్రకటించిన బీజేపీ ఆ దిశగా పని ప్రారంభించింది. అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో, వాల్డ్ క్లాస్ సిటీలను నిర్మించడానికి రెడీ అవుతోంది. అన్ని రాష్ట్రాల మున్సిపల్ శాఖ అధికారులు, మినిస్టర్లతో సమావేశమైన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సిటీల ఎంపికపై డిస్కస్ చేసింది. స్మార్ట్ సిటీలుగా సెలెక్ట్ చేసిన నగరాలకు వాల్డ్ క్లాస్ ప్రమాణాలతో సామాజిక, మౌలిక, ఆర్ధిక సదుపాయాలు కల్పించాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం వచ్చే 20 ఏళ్లలో కనీసం 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ అవసరం అవుతాయని గవర్నమెంట్ అంచనా వేస్తోంది. జనాభా ఆధారంగా స్మార్ట్ సిటీలగా డెవలప్ చేయాల్సిన నగరాలను సెలెక్ట్ చేస్తారు. 40 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న 9 సిటీలు, 10 నుండి 40 లక్షల మధ్య జనభా ఉన్న 44 నగరాలు, 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న 17 నగరాలు, 5 నుండి 10 లక్షల జనాభా కలిగిన 20 నగరాలను సెలెక్ట్ చేసింది. ఈ సిటీల్లో మెరుగైన సౌకర్యాల కోసం ప్రతి వ్యక్తి పై 43 వేల 386 రూపాయలు అవసరం అవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ లెక్కన ప్రతి సంవత్సరం వంద సిటీల్లో 35 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ లు అవసరం అవుతాయి. ఈ సిటీలకు 100 MBPS స్పీడ్ తో వైఫై కనెక్టివిటీని అందిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి మెట్రో,మోనో రైళ్ళు, బై పాస్ రోడ్లు,రింగ్ రోడ్లు, ఫ్లై ఓవర్లు ఏర్పాటవుతాయి. 20 సంవత్సరాల కల్లా 100 సిటీలను స్మార్ట్ సిటీలుగా మార్చాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy