20 నుంచి యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

yadadri old templeయాదాద్రి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక అధ్యయణోత్సవాలు, బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు స్వామివారి అధ్యయణోత్సవాలు, ఈ నెల 24 నుంచి 30 వరకు పాతగుట్ట దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 27వ తేదీన రాత్రి 10 గంటలకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 28న దివ్య విమాన రథోత్సవం, 30న స్వామివారి శతఘట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 20 నుంచి 23వ తేదీల్లో యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి అధ్యయణోత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు నిత్య, శాశ్వత కల్యాణాలు రద్దు చేసినట్లు ప్రకటించారు ఆలయ అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy