2014-15 రైల్వే బడ్జెట్..

sadananda-gowda-r-budget

2014-15 రైల్వే బడ్జెట్..

లోక్ సభలో ఈ రోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  దేశ సంస్కృతికి రైల్వేలు ప్రతీకలని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు వెన్నుముకల్లాంటివని…రోజుకు 12,500 రైళ్లు ప్రతిరోజు 23 మిలియన్ల ప్యాసింజర్లను గమ్యస్థానానికి చేరుస్తున్నాయని గుర్తు చేశారు. రక్షణ, సరుకు రవాణా విషయాల్లో రైల్వే శాఖది కీలక నిర్ణయమన్నారు.  ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 30లక్షల టన్నుల సరుకు రవాణా అవసరమన్నారు. దేశ వ్యాప్తంగా 1.16 లక్షల కి.మీ మేర రైల్వే ట్రాక్ ఉందన్నారు. రైల్వేలో 13లక్షల మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. గత పదేళ్లుగా ఆమోదించిన లైన్లకు ఏడాదికి రూ.5లక్షల కోట్లు అవసరమన్నారు.

676 ప్రాజెక్టులకు రూ.1,57, 883 కోట్లతో లోక్ సభలో ఆమోదం తెలిపారు మంత్రి సదానంద గౌడ. 359 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని…గత పదేళ్లలో 99 కొత్త లైన్లకు ఆమోదం చెప్తే ప్రస్తుతానికి ఒక్క లైన్ మాత్రమే పూర్తయిందని చెప్పారు. రైల్వే నిర్వహణలో ఎఫ్ డీఐలను ఆహ్వానిస్తామన్నారు. పీపీప పద్దతిలో స్పీడ్ ట్రైన్లను ప్రవేశపెడతామన్నారు. గతేడాది రైల్వే ప్రయాణికులు తగ్గారన్నారు. ఈ ఏడాది రైల్వే ఆదాయం రూ. 1,64, 374 కోట్లు వస్తాయని….వ్యయం రూ. 1,49,176 కోట్లు కానుందని అంచనా వేశామన్నారు. ఇక ప్రయాణికుల నుంచి రూ. 44, 645 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్ లో ప్రయాణికుల సౌకర్యాలు, రక్షణకే పెద్దపీట వేస్తామన్నారు.

ప్రయాణికుల కోసం సౌకర్యాలు…

  • పుట్ ఓవర్, టాయిలెట్లు, కనీస సౌకర్యాలు చేపడతాం
  • నాణ్యమైన క్యాటరింగ్  సర్వీసులు.
  • ఏ-1, ఏ-2 కేటగిరి స్టేషన్లలో వై-ఫై సర్వీసులు
  • రైల్వేలో ఫస్ట్ టైం రెడీ టు ఈట్..
  • ఆదాయంలో రూపాయికి 94 పైసలు ప్రయాణికుల కోసమే వినియోగిస్తాం.
  • రైల్వే స్టేషన్లలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఉపయోగిస్తాం
  • ప్రధాన రైల్వే సర్వీసులలో ఆన్బోర్డు హౌస్కీపింగ్

ప్రయాణికుల రక్షణ కోసం..

  • 17 వేల మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని రిక్రూట్ మెంట్
  • 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియామకం
  • డొమెస్టిక్ టూరిజానికి  ప్రొత్సాహం
  • ఈ-టికెటింగ్ పెంపునకు ఆదునాతన సౌకర్యాలు
  • నిమిషానికి టికెట్ల జారీ 2000 నుంచి 7200కు పెంపు
  • త్వరలో రైల్వే వర్సిటీని ప్రారంభిస్తాం
  • ముంబై- అహ్మదాబాద్ మధ్య..త్వరలో బుల్లెట్ రైళ్లు.
  • 10 మెట్రో నగరాల్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటితో స్టేషన్ల అభివృద్ధి

ప్రధాన రూట్లలో హైస్పీడ్ రైళ్లు…

  • నాగాపూర్-సికింద్రాబాద్
  • చెన్నై- హైదరాబాద్
  • 160 కి.మీ నుంచి 200 కి.మీ స్పీడ్
  • బొగ్గు రవాణాకు క్రిటికల్ కోల్ కనెక్టివిటీ
  • రైల్వే ఆదాయం పెంచుకునేందుకు పార్శిల్ సర్వీస్ రైళ్లు
  • రైల్వే స్టేషన్ల నిర్మాణానికి, స్టేషన్ల కోసం..
  • సోలార్ ఎనర్జీని వినియోగిస్తాం
  • 23 అండర్ గ్రౌండ్ ప్రాజెక్టులు నిర్మిస్తాం

రైల్వే బడ్జెట్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు

  • ఏపీ, తెలంగాణలో గతంలో ప్రతిపాదించింది 29 ప్రాజెక్టులు
  • ప్రాజెక్టుల పూర్తికి రూ. 20, 680 కోట్లు కేటాయింపు
  • ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు
  • 18 కొత్త లైన్ల ఏర్పాటుకు సర్వే
  • రాష్ట్రంలో కొత్తలైన్ల ఏర్పాటుకు మొండిచేయి
  • సికింద్రాబాద్-హజరత్ నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్ప్రెస్
  • విజయవాడ-న్యూఢిల్లీ మధ్య ఏసీ ఎక్స్ ప్రెస్
  • విశాఖ-చెన్నైమధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్
  • 5 జన సాధారణ, 5 ప్రీమియం, 6 ఏసీ..
  • 27 ఎక్స్ప్రెస్, 8 ప్యాసింజర్, 5 డెమో సర్వీసులు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy