2015 కల్లా 3G పూర్తి చేస్తామన్న ‘ఎరిక్సన్’..

Nishant-Batra-head-of-Engagement-Practices-at-Ericsson-Indiaఇండియన్ టెలికాం ఆపరేటర్ ఎరిక్సన్ దేశ వ్యాప్తంగా తమ సర్కిళ్లలో 3జీ సర్వీసులు పెంచాలని భావిస్తోంది. 2015 కల్లా తమ 3జీ సర్వీసులను 90 శాతం పూర్తి చేస్తామని కంపెనీ చెప్తోంది. వచ్చే ఏడాదిలోపు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల 3జీ సర్వీసులను అందిస్తామన్నారు. ఏ గ్రేడ్ సర్కిళ్లలో వచ్చే ఏడాది చివరి కల్లా 3జీ సర్వీసులను స్టార్ట చేస్తామన్నారు ఎరిక్సన్ ఇండియా ప్రెసిడెంట్ నిషాంత్ బాత్రా.

సోషల్ మీడియా, వీడియోలతో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ మూలంగా దేశంలో 3జీకి డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు. టెలికం ఆపరేటర్లు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు లెటెస్ట్ టెక్నాలజీలోకి చేంజ్ అవుతున్నారని ఆయన అన్నారు. అయిన తమ కంపెనీ నుంచి 21ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ అందించాలని ప్రయత్నం చేస్తున్నామని..దీంతో ఒక మూవీని 4 నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న మొబైల్ ఫోన్స్ అన్నీ 21 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్ ను అందుకోలేవని ఆయన అన్నారు. గతేడాదితో పొల్చుకుంటే తమకు 10 శాతం కస్టమర్లు పెరిగారని ఆయన అన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy