2015: చేదు జ్ఞాపకాల టాలీవుడ్

tollywood 2015మిగతా వారికి ఎలా ఉన్నా 2015 సంవత్సరం మాత్రం టాలీవుడ్ కి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. తమ నటన, స్టైల్ తో అలరించిన చాలా మంది కళామతల్లి బిడ్డలు కన్నుమూసారు. అదో శాపంలా ఒకరితర్వాత ఒకరు మరణించడం పరిశ్రమనీ., అభిమానుల్ని  కలచివేసింది.

డిఫరెంట్ యాక్టింగ్ , యాస తో ఏ పాత్రలో అయిన ఒదిగిపోయే నటుడు ఆహుతి ప్రసాద్. సిరియస్ రోల్స్ అయిన కామెడీ అయిన తనదైన స్టైల్ లో అలరించేవారు. అయితే క్యాన్సర్ తో 2015 జనవరి 4 న కన్నుమూసి, సంవత్సరం మొదట్లో నే అందర్ని షాక్ కి గురిచేశాడు.

రచయితగా సినీకెరీర్ స్టార్ట్ చేసి కమెడియన్ గా డిఫరెంట్ స్టైల్ తో అలరించాడు ఎమ్.ఎస్.నారాయణ. తాగుబోతు క్యారెక్టర్ చెయ్యడంలో తనకెవ్వరు సాటి లేరు. ప్రతీ రోల్ కూడా వైవిధ్యంగా ప్రెజెంట్ చేస్తాడు. దుబాయ్ సీను, దూకుడు ,  పిల్ల జమిందార్ సినిమాలలో తన యాక్టింగ్ తో అందర్ని కడుపుబ్బా నవ్వించాడు ఎమ్.ఎస్. పండగను జరుపుకున్న తర్వాత సడెన్ గా చనిపోయాడు.

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజీ, ఫిల్మ్ స్టూడియో, ప్రొడక్షన్ హౌస్, గిన్నీస్ రికార్డ్ హోల్డ్ ర్ … దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్ రామానాయుడు సడన్ డెత్ అందర్ని భాదపెట్టింది. క్యాన్సర్ ట్రీటమెంట్ తీసుకుంటూ ఫిబ్రవరీ 18న చనిపోయారు.

మ్యుజిక్ డైరెక్టర్ చక్రవర్తి తనయుడు శ్రీ కొమ్మినేని చేసింది తక్కువ సినిమాలే అయిన ఎప్పటికి గుర్తుండిపోయే సంగీతం తో అలరించాడు. మంచి పాటలతో ఆకట్టుకున్నాడు. తల్లి మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లడం వ్యసనాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని ఎప్రెల్ 18న మరణించాడు శ్రీ. తను పాడిన జగమంత కుటుంబం పాట విన్నప్పుడల్ల అతన్ని తలుచుకుంటారు ఫ్యాన్స్.

అమెరికా నుంచి వచ్చి తెలుగింటి ఆడపడుచులా తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిన అందాల తార ఆర్తీ అగర్వాల్. ఒక పక్క చిన్న హీరోలు మరో పక్క పెద్ద హీరోలతో యాక్ట్ చేసి నంబర్ వన్ స్ధాయికి ఎదిగింది. లవ్ ఫెలవ్వడం, కెరీర్ గ్రాఫ్ పడిపోవడం, మ్యారీడ్ లైఫ్ ఫేల్ అవ్వడంతో డిప్రెషన్ వల్ల వెయిట్ పెరిగిపోయింది. మళ్లీ నార్మల్ అయ్యి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న టైమ్ లో ఒబెసిటి సర్జెరీ వల్ల ఇష్యూస్ వచ్చి ప్రాణం పోగొట్టుకుంది ఆర్తీ. కాని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఎప్పటికీ నిలిచిపోయివుంటుంది.

దక్షిణాది సినిమా చరిత్రలో తన సంగీతానికి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఎం.ఎస్.విశ్వనాథన్. తన మ్యుజిక్ తో ఫ్యాన్స్ ని మంత్రముగ్ధల్ని చేశారు. అంతులేని కథ, మరోచరిత్ర , ఆకలి రాజ్యం, కోకిలమ్మ, అందమైన అనుభవం , ఇది కధ కాదు లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఎమ్.ఎస్. విశ్వనాథన్ జులై 14న అనారోగ్యంతో మరణించారు.

బాలు తర్వాత టాలివుడ్ లో అంత పేరు తెచ్చుకున్న గాయకుడు రామకృష్ణ కూడా అనారోగ్యంతో కన్నుముయ్యడం టాలివుడ్ కి తీరనిలోటు. బలిపీఠం, విచిత్రబంధం, భక్త తుకారం వంటి సినిమాలలో ఆయన పాడిన పాటలు ఎవర్ గ్రీన్.

కళాత్మకత, వైవిధ్యం వున్న నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు నిర్మాత ఏడది నాగేశ్వరరావు. శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, స్వయంక్రుషి, స్వాతిముత్యం, సీతాకోకచిలుక వంటి సినిమాలతో హిట్ ప్రొడ్యుసర్ అనిపించుకోవడమే కాదు. కళలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అర్ధం చేసుకోవచ్చు.

అటు తమిళ్ ఇటు తెలుగులో సహజమైన నటనతో ఆకట్టుకున్న మనోరమ కూడా ఈ సంవత్సరం చనిపోవడం విశాదకరం, దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి. రిక్షావోడు, అరుంధతి లాంటి సినిమాలలో ఆమె నటనను ఎప్పటికీ మరచిపోలేం.

కళ్లు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి , సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు కళ్లు చిదంబరం. మెల్ల కన్ను, వెరైటీ స్లాంగ్ తో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న కళ్లు చిదంబరం కూడా అనారోగ్యంతో అక్టోబర్ 18న మరణించాడు. అయితే ఓకే ..అంటూ డిఫరెంట్ స్లాంగ్ తో అలరించిన కొండవలస కమెడీ చాలా వెరైటీగా వుంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా సినిమాలు చేశాడు. చివరి వరకు నటిస్తూనే నవంబర్ రెండున సడెన్ గా చనిపోయాడు.  మాటల రచయితగా హిట్ సినిమాలతో పాటు ఇండస్ట్రీకి దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యుజిక్ డైరెక్టెర్ ని అందించిన రచయిత సత్యానంద్ కూడా డిసంబర్ లో గుండెపోటుతో మరణించారు. జ్యోతి, అమ్మోరు, క్షణ క్షణం, పెళ్లిసందడి వంటి సినిమాలకు మాటలందిచారు. చేసినవన్ని హిట్ సినిమాలే.

ఇక  హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన అందం , నటన తో ఆకట్టుకున్న రంగనాథ్ ఫ్యామిలీ సినిమాలతో దగ్గరైయ్యాడు. ఆ తర్వాత కెరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రంగనాధ్ మంచి పేరు తెచ్చుకున్నారు. సీరియల్స్ లో కూడా తన నటన కొనసాంగించారు. అయితే భార్య చనిపోవడం, పిల్లలు దూరంగా వుండడంతో డిప్రెషన్ కి లోనయి ఆత్మహత్య చేసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీనీ ప్రేక్షకుల్ని షాక్ కి గురిచేసింది.

తన నటన, టాలెంట్ తో  చివరి క్షణం వరకు ప్రేక్షకుల్ని అలరించిన నటులు దూరం అవ్వడం నిజంగా భాదాకరం. వీరందరి మనసుకి శాంతి చేకూరాలని ఆశిద్దాం. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy