2015 స్టార్ హీరోయిన్ అనుష్క / తమన్నా

2015 star heroineఇయర్ ఎండ్ వచ్చిందంటే చాలు.. న్యూ ఇయర్ జోష్ వచ్చేస్తోంది.. అదేస్థాయిలో ఇయర్ స్టార్స్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఈసారి ఇద్దరు హీరోయిన్స్ ఇయర్ స్టార్ కోసం పోటీలో ఉన్నారు. అనుష్క, తమన్న నువ్వానేనా అంటున్నారు.

అనుష్క అయితే టాప్ రేసులో ఉంది. బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో ఈ మూడు సినిమాలతో వైవిధ్యమైన క్యారెక్టర్స్ లో మెప్పించింది. పగతో రగిలిపోయే తల్లిగా బాహుబలిలో నటిస్తే.. వీరవనితగా రుద్రమదేవిలో కనిపించింది. ఇక లావుగా.. సన్నగా ఒకే మూవీలో టూ షేడ్స్ లో కనిపించి.. నటనలో టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ మూడు సినిమాలు గ్లామర్ రోల్ అయితే కాదు.. లేడీ ఓరియంటెడ్ మూవీస్. అనుష్కనటనకు విమర్శకుల ప్రసంసలు దక్కినా.. గ్లామర్ దగ్గరికి వచ్చేసరికి వెనకబడింది. ఇక తమ్మూ అయితే ఈ ఏడాది హాట్ టాపిక్ అయ్యింది. తన అందచందాలతో యూత్ మనస్సులు దోచింది. బాహుబలిలో కోటలోని రాణిని కాపాడే సైన్యానికి లీడ్ చేసే ధీరవనితగానే కాకుండా శివుడి పక్కన గ్లామర్ రోల్ మత్తెక్కించింది. ఇక బెంగాల్ టైగర్ లోనూ అందాలు ఆరబోసింది. రెండు తమిళ సినిమాలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 2015 ఇయర్ స్టార్ హీరోయిన్ రేసులో అనుష్క, తమ్మూ పోటీపడినా.. గ్లామరస్ లో మిల్కీబ్యూటీకి ఓటేసినా.. యాక్టింగ్ లో మాత్రం అనుష్కకు సై అన్నారు సినీ జనం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy