2019 నాటికి పోలవరం పూర్తి : ఏపీ సీఎం చంద్రబాబు

2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని బుధవారం(సెప్టెంబర్-12) సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీలో నడిచారు. గ్యాలరీ వాక్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పైలాన్ ను ఆవిష్కరించి ఫోటో ఎగ్జిబిషన్ ను చూశారు. ఆ తర్వాత పోలవరం దగ్గర రైతులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని బాబు అన్నారు. 5కోట్ల ప్రజల కలల జలసౌధం పోలవరం అని బాబు అన్నారు. పోలవరం కుడి కాల్వ 90శాతం, ఎడమకాల్వ 63శాతం పూర్తయిందన్నారు. సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని 27సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు పరుగులు పెట్టించామని బాబు తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామని బాబు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy