2019 వరల్డ్‌కప్‌ : ఫస్ట్ మ్యాచ్ ఇండియా-సౌతాఫ్రికా

IND2019 వరల్డ్‌కప్‌ కు సంబంధించి షెడ్యూల్‌ లో చిన్న మార్పు జరిగింది. ఇండియా తమ ఫస్ట్ మ్యాచ్‌ లో సౌతాఫ్రికాతో తలపడబోతున్నది. నిజానికి ఈ మ్యాచ్ జూన్ 2న జరగాల్సి ఉన్నా.. దానిని జూన్ 4కు మార్చారు. లోధా కమిటీ సిఫారసుల మేరకు IPL ఫైనల్‌కు, అంతర్జాతీయ మ్యాచ్‌ కు మధ్య కనీసం 15 రోజుల సమయం కచ్చితంగా ఉండాలి. దీంతో ICC సీఈవోల మీటింగ్‌లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 2019 వరల్డ్‌ కప్ మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లండ్‌ లో జరగనుంది. వచ్చే సంవత్సరం IPL సీజన్ -12 మార్చి 29 నుంచి మే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 4నే ఫస్ట్ మ్యాచ్ ఆడే వీలుంది BCCI అధికారి చెప్పారు. సౌతాఫ్రికాతో ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది. షెడ్యూల్‌ లో మార్పుకు CEC అంగీకరించింది. దీనిని ICC బోర్డుకు సిఫారసు చేశామని అధికారి వెల్లడించారు.

నిజానికి గతంలో ఇండియా, పాకిస్థాన్‌ తోనే పెద్ద పెద్ద ఈవెంట్‌ లను ICC ప్రారంభించేది. 2015 వరల్డ్‌ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఇలాగే ప్రారంభమైంది. అయితే ఈసారి మాత్రం ఇండోపాక్ మ్యాచ్ ఉండటం లేదు. ఈసారి టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది అని ఆ అధికారి చెప్పారు. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌ కప్‌ లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌ తో ఆడాల్సి ఉంటుంది. 2019-23 మధ్య ఐదేళ్ల కాలానికి FTPని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కాలంలో టీమిండియా మొత్తం 309 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్‌ ల సంఖ్య 15 నుంచి 19కి పెరిగింది. ఇవన్నీ టెస్ట్ చాంపియన్‌ షిప్‌ లో భాగంగా జరిగేవే. డేనైట్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఇండియా ఇప్పట్లో ఆడబోవడం లేదు. టెస్ట్ చాంపియన్‌ షిప్‌ లో అన్ని మ్యాచ్‌ లూ డే మ్యాచ్‌లే.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy