2050కు ఇవి అంతరించిపోతాయ్…!

గ్లోబల్ వార్మింగ్…ప్రపంచాన్ని కాదు కాదు భూమండలాన్ని పట్టి కుదిపేస్తున్న భూతం. దీని బారిన పడి మానవజాతి మనుగడ ప్రశ్నార్ధకమయిపోతోంది. ఇంకా చెప్పాలంటే జీవరాశి మొత్తం అంతరించిపోవడానికి కారణమవుతోందీ గ్లోబల్ వార్మింగ్. అంతేకాదు దీనివల్ల భూమి మీద ఉన్న ఎన్నో అద్భుతాలు కూడా కనుమరుఅయిపోయే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. 2050 వచ్చే నాటికి ఫేమస్ ప్లేస్ లు కొన్ని కనిపించకుండా పోతాయని చెబుతున్నారు. ప్రపంచాన్ని చూడాలని కోరిక ఉన్నవాళ్ళు ముందుగా కొన్ని ప్లేస్ లకు వెళ్ళి చూసేయండి అని చెబుతున్నారు. మరో 20 ఏళ్ళు అయితే చూడ్డానికి అక్కడ ఏమీ మిగలదని అంటున్నారు. 2050 కు అంతరించిపోతాయని చెబుతున్నవాటిలో ఈ కిందివి టాప్ 10 బ్యూటిఫుల్ ప్లేస్ లు ఉన్నాయి.

11. ది ఆల్ఫ్స్….

ఐరోపాలో ఉన్న అతి అందమైన ప్లేసెస్ లో ఆల్ఫ్స్ పర్వతాలు ఒకటి. 90 లలోని చాలా మట్టుకు సినిమా పాటల చిత్రీకరణ ఈ పర్వతాలలోనే జరిగేవి. లో ఆల్టిట్యూడ్ లో ఉండే ఈ కొండల్లో స్కీయింగ్ కు చాలా ఫేమస్. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ కొండల్లో మంచు చాలా తొందరగా కరిగిపోతోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే 2050 కల్లా ఆల్ఫ్స్ పర్వతాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది.

2డెడ్ సీ…
డెడ్ సీ చాలా పాపులర్ సముద్రాలలో ఇది ఒకటి. భూమి మీద ఉన్న సముద్రాలలో ఉన్న అన్నింటికన్నా 10 రెట్లు నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండే సముద్రం ఇది. జలరాశులకు అనువు కాని ఈ సముద్రంలో మినరల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కాస్మొటిక్ ఇండస్ట్రీస్ వల్ల ఇప్పడు ఈ సముద్రం వైశాల్యం తగ్గిపోతోంది. ఇప్పటికే ఈ సముద్రంలో ముడువంతుల భాగం తగ్గిపోయింది. ఇండస్ట్రీస్ ప్రభావం వల్ల కొన్నాళ్ళల్లో పూర్తిగా కనుమరుగు అయిపోతుంది.

3గ్లేసియర్ నేషనల్ పార్క్….
హిమానీనదాలుకు పేరుగాంచిన గ్లేసియర్ నేషనల్ పార్క్ సరస్సులకు, పలు వృక్ష జాతులకు పేరుగాంచినది. నేటివ్ అమెరికన్లు నివసిస్తున్న ఈ ప్రాంతంలో 130కు పైగా సరస్సులు, వందల సంఖ్యలు జంతు జాతులు ఉన్నాయి. అయితే కొండల్లోంచి పారే జలపాతాలకు ఈ ప్రాంతం ఎక్కువగా పెట్టింది పేరు. ఒక్కప్పుడు ఇక్కడ 150 హిమానీనదాలు ఉండేవి. కాన 2005 సంవత్సరం వచ్చేసరికి కేవలం 27 మాత్రమే మిగిలాయి. మరో 20 లేదా 30 ళ్ళల్లో ఇవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ జీవరాశికి హిమానీనదాలే ఆయువు. అవి కనుక పూర్తిగా కనుమరుగయితే గ్లేసియర్ నేషనల్ పార్క్ లోని జీవరాశి మనుగడకే కష్టమవుతుంది.

000గ్రేట్ బేరియర్ రీఫ్…
భూమి ఉపరితలం నుంచి కనిపించే అతి కొద్ది ప్లేసెస్ లో ఒకటి గ్రేట్ బ్యారియర్ రీఫ్. అయితే ఇంతటి ఘనత కలిగిన ఈ పగడపు దిబ్బ మరికొన్ని రోజుల్లో భూఉపరితలం నుంచే కాదు అసలు భూమి మీదే కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు, వాటర్ పొల్యూషన్, అతిగా చేపలు పట్టడం, షిప్ ప్రమాదాలు ఈ రీఫ్ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

splitమడగాస్కర్…
ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్ అతిపెద్ద నాల్గవ దీపం మడగాస్కర్. ఇక్కడ మాత్రమే కనిపించే లెమర్ జాతి జంతువులు. రానున్న 35 ఏళ్ళలో ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.

madives1మాల్దీవులు…
2004 సునామీలో బాగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో మాల్దీవులు ఒకటి. అప్పుడు వచ్చిన వరదల్లో 1000 దీవులకు కేవలం 9 దీవులు మాత్రమే మునిగిపోకుండా తప్పింకోగలిగాయి. అయితే ఇప్పుడు ఆ మిగిలిన వాటికి కూడా ప్రమాదం ఉంది. తొందరలోనే గ్లోబల్ వార్మింగ్ వల్ల మునిగిన పోయిన మొదటి దేశంగా ఈ దీవులు నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

olympia1ఒలింపియా…
మొట్టమొదటి లింపిక్స్ జరిగిన స్థలం ఒలిపింయా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్లేస్ వేసవి ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచ పటంలో నుంచి తప్పిపోనుంది. దీనిచుట్టూ ఉన్న అడవుల్లో మంటల వలన ఇప్పటికే చాలా మట్టుకు నాశనమయిపోయిన ఈ నగరం రానున్న రోజుల్లో పూర్తిగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.

pantagonia1పాటగోనియా…
దక్షిణ అమెరికాలో సతరన్ చివరలో ఉండే పాటగోనియాను భూతల స్వర్గంగా పిలుస్తారు. అయితే ఈ లాండ్ ఆఫ్ అన్ టచడ్ బ్యూటీ మరో 40 ఏళ్ళల్లో మాయమవనుంది. వాతావరణంలో విపరీత మార్పులే దీనికి కారణం. వాతావరణంలో వేడి పెరిగిపోవడం వలన ఇక్డి హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఇక్కడి వృక్ష, జంతుజాలాలు నశించిపోతున్నాయి.

sunderbans1మడ అడవులు…
యునెస్కో లెక్కల ప్రకారం అత్యంత తొందరగా కనుమరుగవుతున్న మొదటివాటిలో మడ అడవులు, బెంగాల్ పులులు ఉన్నాయి. నీటి కింద మునిగిపోయే వాటిల్లో ఈ మడ అడవులు కూడా ఉన్నాయి. ఈ అడవులతో పాటు బెంగాల్ పులుల, నీటి మొసళ్ళు, ఆలివ్ రిడ్లే తాబేళ్ళు, గంగా డాల్పిన్స్, మడ గుర్రపుడెక్క పీతలు కూడా అంతరించిపోనున్నాయి.

venice1వెనీస్…
అత్యద్భుత నగరాల్లో ఒకటి వెనీస్. కాలువల మధ్య నగరంగా వెనీస్ చాలా ప్రసిద్ధి పొందింది. చాలా మంది హనీమూన్ స్పాట్ ఈ వెనీస్. మోస్ట్ రొమాంటిక్ నగరమైన వెనీస్ కూడా కొన్ని రోజుల తర్వాత కనిపించదట. ఇక్కడ కాలువల్లో వచ్చే వరదల వల్ల ఈ నగరం మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఉండవలసిన దానికన్నా 131 సెంటీమీటర్ల నీరు ఎక్కువగా ఉంది. ఇది ఫ్యూచర్ లో మరింత పెరిగే అవకాశం ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy