22 ఏళ్లుగా వాటర్ బిల్ అంటే ఏంటో తెలీదు!

bengaluru-rain-water-houseవాటర్ బోర్డుకు బిల్లు కట్టకపోతే… వెంటనే కనెక్షన్ కట్ చేస్తుంది. అయితే బెంగుళూరుకు చెందిన ఏఆర్ శివకుమార్… గత 22 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా కట్టకుండానే… నీటిని ఉపయోగించుకుంటున్నారు. అదెలా సాధ్యం… ప్రభుత్వ అధికారుల తీరే అంత అంటూ…. తిట్టుకుంటున్నారా..? ఆగండాగండి… శివకుమార్ లోని పర్యావరణ మిత్రుడి గురించి తెలుసుకుంటే.. మీరు అలా మాట్లాడలేరు. ఇంకా చెప్పాలంటే.. ఆయన ఇంటికి వాటర్ కనెక్షనే లేదు.

శివ కుమార్ ఎకో-ఫ్రెండ్లీగా కట్టుకున్న ఇళ్లు.. నీటి పొదుపుతో పాటు… ఆయన జేబుకు చిల్లు పడకుండా చేస్తోంది. ఆయన సైంటిస్టు కూడా అవ్వడంతో ఆయనలోని శాస్త్రవేత్త … గ్రీన్ హోమ్ నిర్మించుకునేలా చేశాడు. గత ఇరవై రెండేళ్లుగా వర్షపు నీటిని నిలువ ఉంచుకుని.. ఉపయోగించుకుంటోంది శివ ఫ్యామిలీ. ట్యాంకులు నిర్మించుకుని.. నీటిని పొదుపు చేస్తున్నారు. ఆ నీటిని శుద్ధి చేసి ఉపయోగించుకుంటున్నారు.

నీటి లెక్కలు కూడా పక్కాగా కట్టారు శివకుమార్. దానికి అనుగుణంగానే నీటిని పొదుపు చేస్తున్నారు. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి రోజుకు 400 లీటర్ల చొప్పున ఏడాదికి 1.5 లక్షల లీటర్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. బట్టలు ఉతికాక వృధాగా వెళ్ళే నీటిని టాయిలెట్ లోను, కిచెన్ లో గిన్నెలు తోమగా వచ్చే నీటిని గార్డెన్ లోను వాడుతున్నారు. అలా ఇరవై రెండేళ్లుగా బిల్లు చెల్లించే అవసరమే లేకుండా.. నీటిని పొదుపు చేస్తూ ఉపయోగించుకుంటున్నారు. అయితే.. ఈ  జలయజ్ఞంలో తనొక్కడినే భాగస్వామిని కాదని.. తన ఫ్యామిలీ అంతా పాలుపంచుకుంటోంది అంటారు శివకుమార్. ఇదండి ఓ సైంటిస్టు నీటి పొదుపు కథ.

ఎండా కాలంలో పెదాలు ఎండిపోతుంటే.. నీటి చుక్క కోసం పరితపిస్తుంటాం. ట్యాంకుల్లో నీళ్లు లేకపోయినా.. సరైన సమయానికి నీళ్లు రాకపోయినా… గుండె ఆగినంత పని చేస్తాం. కానీ… నీటిని పొదుపుగా వాడుకోవడం ఎలా అనే విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోం. అలాంటి వారందరికీ… శివకుమార్ ఓ దిక్సూచి. ఆయన దారిలో నడిస్తే… నీటి కష్టాలే ఉండవంటున్నారు జలవనరుల నిపుణులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy