25న ఇల్లు ఖాళీ చేస్తా: అజిత్ సింగ్

ajithఈ నెల 25 తేదీన తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని చెప్పారు కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్. నిన్న కేంద్ర ప్రభుత్వం కరెంట్ కనెక్షన్ తో పాటు వాటర్ కనెక్షన్ కట్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఆగస్ట్ 11న తనకు ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయని చెప్పారు. ఆ ఇంటిలో 36 ఏళ్ల నుంచి ఉంటున్నానని, తన తండ్రి మాజీ పీఎం చౌదరి చరణ్ సింగ్ 1978లో ఆ ఇంటికి వచ్చారని చెప్పారు. ఇప్పుడు మంచి రోజులు లేవు కాబట్టి రెండు వారాల తర్వాత ఖాళీ చేస్తానని చెప్పారు అజిత్ సింగ్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy