25 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫీజు గడువు పొడిగింపు

inter-boardఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఏప్రిల్- 25 వరకు పొడిగించారు ఇంటర్ బోర్టు అధికారులు. మొదట ఏప్రిల్- 20 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు గడువు పొడిగించాలని విజ్ఞప్తిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఏ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా కల్పించామన్నారు.  tsbies cgg వెబ్‌సైట్ ద్వారా అదనపు రుసుము లేకుండా ఈ నెల 25 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy