27న టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం

trs-lpmeetతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్లమెంటరీ, శాసనసభా పక్ష సంయుక్త సమావేశం  ఈ నెల 27 (శనివారం)న  నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో ప్రధానంగా పార్టీ సభ్యత్వాలు, పార్టీ కమిటీల పని విధానంపై చర్చ జరుగుతుంది. దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారుకేసీఆర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy