27 నుంచి మండలి సమావేశాలు

 శాసన మండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాల నిర్వహణపై శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే గురువారం(సెప్టెంబర్ 27న) ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. శాసనసభ రద్దయిన నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు చివరిసారిగా మార్చి 27న జరిగాయి. ఆరునెలల్లోపు కచ్చితంగా సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ ఖరారైంది.

శాసనసభ రద్దయి… శాసనమండలి సమావేశాలు మాత్రం జరుగుతుండటం అరుదైన అంశం. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. శాసన మండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 27న స్పష్టత రానుంది. సమావేశం ఎన్ని రోజులు జరుపాలనేది మండలి కార్యకలాపాల నిర్వహణ సలహా కమిటీ(బీఏసీ) నిర్ణయిస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy