28నే మెట్రో ప్రారంభం.. ప్రధాని షెడ్యూల్ ఖరారు

metroషెడ్యూల్ ప్రకారమే నవంబర్ 28న మెట్రో రైల్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. పీఎం టూర్ పై కొంత సందిగ్ధత ఉన్నా…టూర్ పై పీఎంవో నుంచి క్లారిటీ వచ్చింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి అధికారిక సమాచారం అంది. 28 మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోడీ. 3గంటల25 నిమిషాలకు నేరుగా మియాపూర్ మెట్రో స్టేషన్ చేరుకొని…మెట్రో రైల్ ను ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు 5 కిలోమీటర్లు రైలులో ప్రయాణిస్తారు మోడీ. తిరగి మియాపూర్ చేరుకుని.. అక్కడే ఏర్పాటు చేయబోయే ఫొటో ఎగ్జిబిషన్ ను చూస్తారు.

మెట్రో ప్రారంభం తర్వాత హెలికాప్టర్ లో HICC చేరుకుంటారు మోడీ. ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. ఆ తర్వాత ఎనమిదిన్నరకు శంషాబాద్  నుంచి తిరిగి ఢిల్లీ వెళతారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy