28 నుంచి వేరే వేరు ఆర్టీసీలు

tsapఆర్టీసీ విభజనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 28 నుంచి తెలంగాణ, ఏపీలకు ఆర్టీసీ కార్యక్రమాలు విడివిడిగా జరగనున్నాయి. బస్ భవన్ లోని బీ బ్లాక్ ను తెలంగాణకు, ఏ బ్లాక్ ను ఏపీకి కేటాయించారు. ఈడీలు, ఆర్ఎంలతో రాష్ట్రస్థాయి అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తయ్యింది. రాష్ట్ర విభజన జరిగి తర్వాత 11 నెలలు దాటినా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలు అందిస్తోంది ఆర్టీసీ. ఉమ్మడి ఆస్తుల విభజన ఓ కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణమవుతోంది.ఉద్యోగుల విభజన పూర్తి కావడంతో ఉమ్మడి ఆస్తుల పంపిణీపై దృష్టి పెట్టారు ఎండీ. ఆర్డీసీ బోర్డు సమావేశంలో  తీర్మానం చేసి.. ఆ కాపీని కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలా బేడీ కమిటీకి పంపించాలని నిర్ణయించారు. ఈ సమావేశాన్ని ఈ నెల 23 నిర్వహించాలనుకున్నా..తర్వాత 25వ తేదీకి మార్చారు. ఉమ్మడి ఆస్తులపై పంపిణీపై డిఫెంరెంట్ డిస్కషన్ నడుస్తోంది.

బస్ భవన్, తర్నాక హాస్పిటల్, మియాపూర్ బస్ బాడీ యూనిట్ ను ఉమ్మడి ఆస్తుల పరిధిలో చేరుస్తూ… ఆర్టీసీ అడ్వైజరీ కమిటీ నివేదిక ఇచ్చింది. ఏపీ సంఘాలు, ఇతర సంఘాలు మాత్రం 14 ఆస్తుల్ని ఉమ్మడి ఆస్తుల్లో చేర్చి రెండు రాష్ట్రాలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడి ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ సంఘాలు వాదిస్తున్నాయి.  అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 14నే పరిపాలన విభజన జరగాలి. కాని కార్మికుల సమ్మె వల్ల వాయిదా పడింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy