29న భజ్జీ పెళ్లి

02-1443763766-harbhajan-geeta-basraటీమిండియా స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ మ్యారేజ్ ఈ నెల 29న జరగనుంది.  చాలా కాలంగా బాలీవుడ్ నటి గీతా బస్రాతో లవ్ లో మునిగితేలిన భజ్జీ చివరకు సంప్రదాయ బద్ధంగా ఆమెను పెళ్లాడనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి పెళ్లి కోసం అతిథులను ఆహ్వానించేందుకు హార్భజన్ కుటుంబం కలర్‌పుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్లను సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా భజ్జీ మ్యారేజ్ జరగనుంది. నవంబర్ 1న ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో కొత్త జంట గ్రాండ్ రిసెప్షన్‌ను ఇస్తున్నారు. ప్రస్తుతం గీత బస్రా లండన్‌లో ఉండగా.. ముంబైలోని డిజైనర్లు ఆమె పెళ్లికి  వేసుకోవాల్సిన  బట్టలను  డిజైన్‌ చేసి అక్కడికే పంపిస్తున్నట్లు తెలిసింది. ధర్మశాలలో జరగనున్న ట్వంటీ20 మ్యాచ్‌ జట్టులో హార్భజన్ సింగ్‌కు చోటు దక్కించుకున్నాడు.

BAJJI CARDహర్భజన్‌కి కూడా అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు ఖరారు చేసినట్లు సమాచారం. భజ్జీ వివాహ వేడుకకు టీమిండియా ఆటగాళ్లతోపాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy