2G కాదు, 3G కాదు, ఏకంగా 5G!

hu

మీరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నట్లయితే 2G, 3G ఏంటో మీకు చెప్పనక్కర లేదు, వాడకపోయినా 2G పేరిట జరిగిన కుంభకోణం పుణ్యమా అని చిన్నా పెద్దా అందరికీ ఇది ఫోన్లకు సంబంధించిన టెక్నాలజీ అని గుర్తు రావడం ఖాయమ్. అయితే కొత్త విషయం ఏమిటంటే అతిత్వరలోనే ఏకంగా 5G స్థాయి టెక్నాలజీ ఉన్న ఫోన్ ప్రసారాలు రానున్నాయట! ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యునికేషన్ల ఆధారిత వస్తువుల తయారీదారు అయిన చైనా కంపెనీ హ్వా వెయ్ వారు ఇప్పటికే 5G టెక్నాలజీని ఫోన్లలో వాడడం ద్వారా డేటా సరఫరా ఎలా ఉంటుందన్నది పరిశీలిస్తున్నారట. 4G ద్వారా 100 MB నుండి 1 GB దాకా డేటా సరఫరా ఉండవచ్చు, అదే 5G ద్వారా ఏకంగా 10 GB/Sec. స్పీడ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

అంటే మామూలు లెక్కల్లో రెండు బ్లూ రే సినిమాలు ఒకే ఒక సెకనులో download చేయవచ్చన్నమాట! ఈ వ్యవస్థతో 3D సినిమాలను కూడా మొబైల్ ఫోన్లలోకే పంపుకోవచ్చు. ఈ సాంకేతికత బాగా అందుబాటులోకి రావడానికి మరో అయిదేళ్ళు పడుతుందని  అంచనా.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy