తమిళనాడు సీఎంగా పళని ప్రమాణం

palaniతమిళనాడు సీఎంగా శశికళ వర్గం నేత పళనిసామి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో తమిళనాడుకు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించారు గవర్నర్ విద్యాసాగర్ రావు. పళనిసామితో పాటు 30 మంది మంత్రులు మూకుమ్మడిగా ప్రమాణం చేశారు.

పన్నీర్ సెల్వం, పాండయరాజన్ తప్ప…గత కేబినెట్ లో ఉన్న మిగతా అందరికీ అవకాశం కల్పించారు పళనిసామి. సెంగొట్టియాన్ కు కొత్తగా కేబినెట్ లో స్థానం కల్పించారు. పాండియరాజన్ స్థానంలో ఆయనకు స్థానం దక్కింది.

పళనిసామితో పాటు మొత్తం 30 మంది నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం గోల్డెన్  బే రిసార్ట్ నుంచి రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్లారు పళనిస్వామి వర్గం నేతలు. అయితే మెరినా బీచ్ లో అమ్మసమాధి దగ్గర నివాళులర్పించిన నేతలు…రాజ్ భవన్ కు చేరుకున్నారు. అయితే  మెజార్టీ శాఖలను తనదగ్గరే ఉంచుకున్నారు పళనిసామి…ప్రభుత్వంలో ప్రధానమైనా హోం, ఆర్ధిక, ప్లానింగ్, హైవేలు, ఇరిగేషన్ శాఖలు తనదగ్గరే ఉంచుకున్నారు సామి.

తమిళనాడు కొత్త సీఎం.. పళనిసామి మంత్రివర్గంలో ఎవరెవరికీ ఏ ఏ శాఖలు ఉండనున్నాయో తెలుపుతూ లేఖను విడుదల చేసింది రాజ్ భవన్. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల మధ్య 72 రోజులపాటు కొనసాగిన రాజకీయ క్రీడకు తెరపడింది. తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా తిరుకె పళనిసామి ప్రమాణ స్వీకారంచేయించారు గవర్నర్ విద్యాసాగర్ రావు.

పళనిసామి కొత్త మంత్రివర్గం ఇదే..

ముఖ్యమంత్రి : కే  పళనిసామి

(హోం, ఆర్థిక, రెవెన్యూ, పరిపాలన శాఖలు)

అటవీశాఖ మంత్రి : సీ శ్రీనివాసన్

యువజన, స్పోర్ట్స్, విద్యాశాఖ మంత్రి: కే ఏ సెంగొట్టియన్

సహకార శాఖ మంత్రి: కే రాజు

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ: తంగమణి

మున్సిపల్ అండ్ గ్రామీణ శాఖ: ఎస్పీ వేలుమణి

మత్స్యశాఖ మంత్రి: జయకుమార్

న్యాయశాఖ మంత్రి: ఎస్ షణ్ముఖం

ఉన్నతవిద్యాశాఖ మంత్రి: కేపీ అన్బలగన్

సోషల్ వెల్పేర్ శాఖ: వీ సరోజ etc..

M.C.సంపత్…పరిశ్రమల శాఖ, K.C. కరుప్పనన్…పర్యావరణ శాఖ, R.కామరాజ్…పౌర సరఫరాలు, O.S.మణియన్…జౌళి శాఖ, K.రాధాకృష్ణన్…పట్టణ, గృహనిర్మాణ శాఖ, G.భాస్కరన్…ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, S.రామచంద్రన్…దేవాదాయ శాఖ, S.వలర్మతి…వెనకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమం, P. బాలకృష్ణారెడ్డి…పశుసంవర్ధక శాఖ, C. విజయభాస్కర్…వైద్య, కుటుంబ సంక్షేమం, R. దొరల్ కున్ను.. వ్యవసాయం, కడంబూర్ రాజు…సమాచార, ప్రసారాలు, R.B. ఉదయ్ కుమార్…రెవెన్యూ, N. నటరాజన్…టూరిజం, K.C. వీరమణి.. వాణిజ్య పన్నులు, రాజేంద్ర బాలాజీ…పాల ఉత్పత్తుల, డెయిరీ అభివృద్ధి, P. బెంజిమెన్…గ్రామీణ పరిశ్రమలు, నీలోఫర్ కఫీల్, కార్మికశాఖ, MR విజయభాస్కర్…రవాణాశాఖ, M. మనికందన్…ఐటీ శాఖ, V.M. రాజలక్ష్మి, ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించారు. మొత్తం 31 మందితో కేబినెట్ కోలువుదీరనుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy