35% కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ఓకే: పోచారం

pocharamలక్ష రూపాయలలోపు రుణమాఫీలో 25 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి… రైతులకు మరో 35 శాతం కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు అంగీకరించారని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ రోజు బ్యాంకర్లతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైన తర్వాత పోచారం మాట్లాడారు. త్వరలో కొత్త రుణాల లిస్టును బ్యాంకులు ప్రకటిస్తాయని, రైతులందరూ రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని చెప్పారు. ఈ ఏడాదినుండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, ఇకపై రైతులకు పెద్దగా పంటనష్టం ఉండబోదని అన్నారు. అలాగే, అక్టోబర్ 1 నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు పోచారం. ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, రేపటినుండి బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ఈ ఏడాది బ్యాంకులు 50 శాతం నుండి 60 శాతం వరకు రుణాలిస్తాయని చెప్పారు ఈటెల.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy