3500మంది పోలీసులతో ప్రధానికి బందోబస్తు

modiరాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి ఘన స్వాగతం పలికేందుకు రెడీ అయ్యింది సర్కారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మెదక్‌జిల్లా కొండపాక మండలం కోమటిబండలో జరుగబోయే మిషన్ భగీరథ మొదటి దఫా ప్రారంభ కార్యక్రమానికి 3500మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. ఒక అదనపు డీజీపీ నేతృత్వంలో ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. వీరితో పాటు అదనపు డీఎస్పీలు, డీఎస్పీలు 50మంది వరకు ఉంటారని, సిబ్బంది అంతా 3500 మంది భద్రత నిర్వహిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీస్ సిబ్బందితో పాటు ప్రధాని భద్రత విభాగమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్‌పీజీ) కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే ఎస్‌పీజీకి చెందిన ఇద్దరు డీఐజీలు, నలుగురు ఎస్పీలు సభస్థలి, స్టేజ్, రూట్, కాన్వాయ్, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. వీరితో పాటు ఎస్‌పీజీకి చెందిన 44మంది సిబ్బంది ప్రధానిమోడీ సెక్యూరిటీగా భద్రతలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో జరిగే బీజేపీ సభకు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 2500 మంది పోలీస్ సిబ్బంది భద్రతలో నిమగ్నమవుతారని ఆయన తెలిపారు. బహిరంగ సభను 88 సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. మొట్టమొదటి సారిగా ఫేషీయల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నామన్నారు. దీని ద్వారా సభకు వచ్చే అనుమానితుల వివరాలను రాబట్టడంతో పాటు పాత నేరస్థులను గుర్తించేందుకు ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy