ఖర్చుల అదుపు ఎలా..?

0సంపాదన తక్కవ.. ఖర్చులు ఎక్కువైన  రోజులివి. పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తారు. ఖర్చులను సాధ్యమైనంత మేర నియంత్రించుకోగలిగితే.. భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును సమకూర్చుకోవచ్చు..ఇలా ఖర్చులను నియంత్రించుకోవడంలో చాల మంది పోరపాట్లు చేస్తుంటారు..ఈ పొరపాట్లు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో.. వెల్త్ మేనేజ్ మెంట్ లో  తెలుసుకుందాం.

ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయాలని పెద్దలు ఎప్పుడూ చెపుతుంటారు. అయితే చాలా మంది ఖర్చులను నియంత్రించుకోవడంలో భాగంగా తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేసేస్తుంటారు. ఖర్చులు పెట్టే విషయంలో మన అలవాట్లు  చాలా కీలకం. జీతం రూపంలోనో.. వ్యాపారం రూపంలోనే వచ్చే డబ్బు మనల్ని ధనవంతులను చేయదు.. వచ్చే సంపాదనను ఎలా ఖర్చు చేస్తున్నమనేదాన్ని బట్టి మనం ఎంత త్వరగా ధనవంతులవుతామనేది ఆధారపడి ఉంటుంది.

కొంటే ఎక్కువ మొత్తంలోనే కొనాలా?

ఎక్కువ మొత్తంలో కొంటే తక్కువ ధరకు వస్తాయనే సూత్రాన్ని అందరు పాటిస్తుంటారు. ఇది అన్ని సార్లు కరెక్టు కాదు. ఓ వస్తువును ఒక్కోక్కటిగా కొనడం కంటే  ఎక్కువ సంఖ్యలో కొంటే తక్కువ ధరకు రావచ్చు కాని ఇది కూరగాయలు, పండ్లు తదితర ఆహార పదార్థాల విషయంలో సరైంది కాదు. కొన్న పదార్ధాలను నిర్ణీత తేది లోగా వాడుకోకపోతే.. కొన్న ఆహార పదార్థాలు పాడయ్యే అవకాశముంది. ఇంట్లో ఉండే వ్యక్తుల సంఖ్యను.. వినియోగాన్ని బట్టి వస్తువులను కొనుగోలు చేయాలి.. లేదంటా నష్టపోవల్సి రావోచ్చు. అందుకే ఎదైనా కొనేముందు ఎంత మిగిలుతుంది అనే దానికంటే ఎలా మిగుల్చుకోవచ్చన్నది తెలుసుకోవాలి.  కొనాలనుకునే వస్తువులు నిజంగా అవసరమా.. కొన్న వాటిని నిల్వ చేసుకునేందుకు తగిన స్థలం ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఒకే సారి ఎక్కువ మొత్తంలో కొన్నా వాటని నిర్ణీత గడువులోగా వినియోగించుకోగలమా అనేది నిర్ణయించుకోవాలి.

ఆఫర్లు అన్నీ మంచివేనా?

చాలా సార్లు తక్కువ ధరకు వస్తున్నాయని అవసరం లేకున్నా కొనేస్తుంటారు.. టివీలు, ఫ్రిజ్ లాంటి వైట్ గూడ్స్ విషయంలో పాతవాటిని ఎక్చేంజ్ చేసి ఆప్ డేటెడ్ వెర్సన్ తీసుకొండంటూ ఫెస్టివల్స్ సమయంలో ఎలక్ట్రానిక్ షోరూంలు ఊదరగొడుతుంటాయి. నిజంగా అవసరమైతే ఇలాంటి వాటిని తీసుకోవచ్చు కాని అవసరం లేకున్నా.. కొంటే మాత్రం ఖర్చులను పెంచుకున్నట్లే.. ఇలాగే రెడీమేడ్ డ్రెసెస్ కూడా అంతే.. బై వన్ గెట్ వన్ .. బై టూ గెట్ వన్ అంటూ అట్రాక్టివ్ స్కీంలును ప్రకటిస్తుంటాయి. టెమ్ట్ అయిపోయి క్వాలిటీ ఉందో లేదో తెలుసుకోకుండా కొనేస్తుంటారు. జేబులో డబ్బు లేకున్నా క్రెడిట్ కార్డును వాడేస్తుంటారు. ఇది సరైంది కాదు.. ఏ వస్తువు కొన్నా క్వాలిటీ ముఖ్యం. ఆన్ లైన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది..షాపింగ్ కు ఏం వెళతాంలే అని ఆన్ లైన్ లో అట్రాక్టివ్ గా కనిపించే వాటిని  బుక్ చేస్తుంటారు. తీరా ప్రాడక్ట్ డెలివరీ అయి ఒకటి రెండు సార్లు వాడిన తరువాత అది నాణ్యత లేదని తెలిపోతే అసలుకే మోసం వస్తుంది.

కొన్ని సార్లు ఫ్రెండ్సో, బంధువులో షాపింగ్ కు తోడుగా రమ్మంటారు. తీరా షాపింగ్ కువెళ్లిన తరువాత  హెల్ప్ చేయడానికి వచ్చింది మరిచిపోయి..మీరే ఎక్కువ కొనేస్తారు.. ఇలాంటి అనవసర కొనుగోళ్లు మానుకోవాలి. లేదంటే మీ ఖర్చులు పెరిగిపోతాయి. ఇలా వెళ్లాల్సి వస్తే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తీసుకోకపోవడమే మంచింది. కేవలం అవసరం మేరకే డబ్బును ఉంచుకుంటే టెంప్ట్ అయినా.. కొనుగోలు చేయలేరు..ఇలా ఖర్చులను నియంత్రించుకోవచ్చు.

బ్రాండెడ్ వస్తువులే కొనాలా?

ఖరీదైన వస్తువుల క్వాలిటీ బాగుంటుందని  చాలా మంది నమ్ముతారు. అయితే ఇదే క్వాలిటీతో తక్కువ ధరకు అలాంటి వస్తువు వస్తుందా అనేది తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేయరు. ముఖ్యంగా బ్రాండెడ్ వస్తువులన్నీ నాణ్యమైనవేనని అందరూ గుడ్డిగా నమ్ముతారు. దీని ధర ఎంతైనా కొనేస్తారు. అలాగే ఓ వస్తువు తక్కువ ధర ఉందని.. డబ్బు ఆదా అవుతుందని కొనేస్తారు..  తరువాత నాణ్యత లేదని తేలిపోతే అది వృధా ఖర్చవుతుంది.

ఖర్చులకు మించి ఆదాయం ఉన్నప్పుడే భవిష్యత్తులో ధనవంతులవుతారు.. సాధ్యమైనంత మేర వృధా ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయాలి.. ఖర్చుల విషయంలో మనసును అదుపులో పెట్టుకోవాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే  ఎక్కడ ఖర్చు చేయాలి.. ఎక్కడ  పొదుపు చేయాలి అనేది తెలసుకోవాలి..ఇలా చేసిన వారే భవిష్యత్తును ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేస్తారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy