మరోసారి అమెరికాకు వెళుతున్నారు

17-narendra-modi-us-flag-600మేకిన్ ఇండియా ప్రమోషన్, పెట్టుబడుల ఆకర్షణ, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా.. మరో ఫారిన్ టూర్ కు రెడీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. రేపట్నుంచి నుంచి ఐర్లాండ్, అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. బిజినెస్ కమ్యూనిటీలోనే కాదు…  కామన్ పీపుల్ లోనూ మోడీ టూర్ పై  ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.

ఈనెల 29తో రెండు దేశాల పర్యటన ముగుస్తుంది. ఒక్క రోజు టూర్ కోసం…. 23న ఐర్లాండ్ లో మోడీ ల్యాండ్ కానున్నారు. 60 ఏళ్ల తర్వాత… భారత ప్రధాని ఐర్లాండ్ లో పర్యటించడం ఇదే ఫస్ట్ టైమ్. అక్కడి ప్రధాని ఎండా కెన్నీతో.. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలపై చర్చించనున్నారు. అక్కడి భారత కమ్యూనిటీతోనూ సమావేశం అవుతారు. 24 నుంచి మోడీ అమెరికా టూర్ మొదలవుతుంది. భారత ప్రధాని హోదాలో ఆయన… యూఎస్ లో పర్యటించడం ఇది రెండోసారి. న్యూయార్క్ లో… ఐక్యరాజ్యసమితి సదస్సులో మోడీ పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్వహిస్తున్న మరో సదస్సుకు అటెండ్ అవుతారు. ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా కమిటీలో మార్పులు చేర్పులపై.. బ్రెజిల్, జర్మనీ, జపాన్ నేతలతో మోడీ భేటీ అవుతారు. ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడంపైనా కాన్సన్ ట్రేట్ చేయనున్నారు ప్రధాని. భారత్ లో పెట్టుబడి అవకాశాలపై ఫార్చూన్ -500 కంపెనీలకు చెందిన 50 మంది సీఈవోలతో భేటీ కానున్నారు.

ఇక ఫేస్ బుక్ హెడ్ క్వార్టర్ లో మార్క్ జుకెర్ బర్గ్ తో పాటు… అక్కడి ఉద్యోగులతో టౌన్ హాల్ లో మోడీ ఇంటరాక్ట్ అవుతారు. గూగుల్ క్యాంపస్, టెస్లా మోటార్స్ ను మోడీ సందర్శిస్తారు. మరోవైపు యూఎస్ లోని భారత కమ్యూనిటీతోనూ సమావేశం కానున్నారాయన.

అయితే మోడీ యూఎస్ టూర్ పై మరోసారి హైప్ క్రియేట్ అవుతోంది. మళ్లీ మ్యాడిసన్ స్క్వేర్ తరహాలో… భారీ ఈవెంట్ కు అక్కడి భారతీయులు ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ టైమ్ ట్రిప్ కంటే మరింత గ్రాండ్ గా.. ప్రధానికి వెల్ కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy