రైతన్నా ఆత్మహత్యలొద్దు.. అండగా ఉంటాం

KCR-IMAJE---2

రైతులకు అండగా ఉంటామని.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదుకోవటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగా ఉందన్నారు. మిషన్ కాకతీయపై విమర్శలు చేయటం సరికాదన్నారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ మెచ్చుకున్నారన్నారు. బ్రిక్స్ బ్యాంక్ అధినేత కామత్ ప్రశంసించారు. అంతటి పెద్ద ప్రాజెక్ట్ పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

 

 

> మిగతా రుణమాఫీ ఒకేసారి చేయటానికి పూర్తిగా కృషిచేస్తాం : సీఎం

> వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు చేశాం : సీఎం

> హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇన్ పుట్ సబ్సిడీ రూ.600 అందించాం

> గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా పరిహారం అందించాం

గతంలో విత్తనాలు, ఎరువుల కోసం కొట్లాటలు జరిగేవి

> ఎరువులు, విత్తనాల కొరతపై పూర్తిస్థాయి సమీక్ష జరిపాం : సీఎం

> రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశాం : సీఎం

> గత ప్రభుత్వాలు రాష్ట్రంలో 176 గోడౌన్లు మాత్రమే నిర్మించాయి

> టీఆర్ఎస్ ప్రభుత్వం గోడౌన్ల సంఖ్యను 330కి పెంచింది : సీఎం

> అన్ని మార్కెట్లలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం : సీఎం

> డ్రిప్ ఇరిగేషన్ దళితులకు 100%, బీసీలకు 90%, ఓసీలకు 80% సబ్సిడీ

> పన్నెండున్నర ఎకరాలకు డ్రిప్ సబ్సిడీ కల్పిస్తున్నాం : సీఎం

> పండిన పత్తిలో 91శాతం సీసీఐ కొనుగోలు చేసింది: సీఎం

> దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం రివ్యూ చేసింది : సీఎం

> మహారాష్ట్రలో ఎకరాకు 100 టన్నులు చెరకు పండిస్తే మనకు 30కి మించటంలేదు

> ప్రభుత్వాల ప్రోత్సాహం లేకనే రైతు దిగుబడి సాధించలేకపోయాడు

> 500 ఎకరాలకు ఒక వ్యవసాయః విస్తరణ అధికారిని నియమిస్తున్నాం

> దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు

> రైతులకు సలహాలిచ్చేలా వ్యవసాయ శాఖను ఆధునీకరిస్తున్నాం

> కరవు మండలాల నిబంధనలు అస్తవ్యస్థంగా ఉన్నాయి : సీఎం

> కరవు మండలాల లిస్ట్ పంపేందుకు కేంద్రం 150 రోజుల సమయం ఇచ్చింది

> నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తాం : సీఎం

> వ్యవసాయ వర్శిటీకి అధిక నిధులు కేటాయిస్తాం : సీఎం

> వచ్చే జనవరికి తెలంగాణ రైతులు సీడ్ ప్రొడక్షన్ చేసేలా చూస్తాం

> ప్రతియేటా రూ.25వేల కోట్లు ఇరిగేషన్ కు ఖర్చుచేస్తాం : సీఎం

> రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : సీఎం

> రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉంది : సీఎం

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy