బతుకమ్మ సంబరాలు ప్రారంభం

dubai-bathukamma2తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయింది… జాగృతి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి కవిత అధ్యక్షతన బతుకమ్మ నిర్వహిస్తోంది జాగృతి సంస్థ. ఎప్పట్లాగానే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణకే సొంతమైన ఘనమైన సాంప్రదాయాన్ని.. భవిష్యత్ తరాలకు అందించటమే ప్రధాన లక్ష్యంగా.. బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తోంది జాగృతి. బతుకమ్మ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బతుకమ్మ గుర్తొచ్చేలా పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే తమ ఉద్దేశ్యమన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత.

2014-09-26_190212_Kalvakuntla_Kavitha_MPబంగారు బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రారంభం కానున్నాయి. 13న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో జరుగుతాయి. 14న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో, 15న మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి గ్రామంలో నిర్వహించనున్నారు. 16న రంగారెడ్డి జిల్లా వికారాబాద్, 17న మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో బతుకమ్మ ఉత్సవాలు జరపనున్నారు. ఈ నెల 18న మొదటిసారి మహారాష్ట్రలోని ముంబైలో బతుకమ్మ వేడుకలను.. జాగృతి నిర్వహించనుంది. ముంబైలో జరిగే వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా కవిత పాల్గొననున్నారు. 19న నల్గొండ జిల్లా దేవరకొండలో జరగనున్నాయి. 20న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఎండ్ చేసేందుకు జాగృతి ప్లాన్ చేసింది.

26ఇవాళ తొలిరోజు పండుగ నిర్వహించే నర్సంపేట అంగడి స్థలాన్ని అందంగా ముస్తాబు చేశారు. స్థానికంగా బతుకమ్మలు పేర్చే కార్యక్రమంలో కవిత పాల్గొంటారు. సాయంత్రం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అంగడి స్థలం వరకు బతుకమ్మలతో ర్యాలీగా వెళతారు. అక్కడే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడతారు. బంగారు బతుకమ్మ సక్సెస్ కోసం పొందుపు సంఘాల మహిళలకు ఇంటికి కిలో చొప్పున పూలు పంపిణీ చేసింది జాగృతి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy