టైగా ముగిసిన మూడో వన్డే

ind2 తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ టై తో ముగించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డే టై అయింది. 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ధోనీ 50, అశ్విన్ 65, జడేజా 66 పరుగులు చేశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 314 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో వన్డే టై అవడంతో సీరీస్ లో భారత్ ఆశలు పదిలం అయ్యాయి. భారత్ బ్యాటింగ్ లో చివరి ఓవర్ ఉత్కంఠగా సాగింది. చివరి ఆరు బంతులకు 18 పరుగులు చేయాల్సి ఉండగా భారత్ 17 పరుగులు చేసి మ్యాచ్ ను టై గా ముగించింది.

మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ కేప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాంగ్ జట్టులో మార్టిన్ గుప్తిల్ 111, జెస్సీ రైడర్ 20, విలియమ్సన్ 65, టేలర్, 17,సౌధీ 27, రోంకి 38 పరుగులు చేశారు. భారత బౌలర్లు షమీ 2, జడేజా 2, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీశారు. భారత్ బ్యాటింగ్ లో న్యూజిలాంద్ బౌలర్ అండర్సన్ 5 వికెట్లు తీసాడు. మూడో వన్డే టై అవడం భారత్ కు కలిసి వచ్చింది. రెండో పరాజయంతో వన్డేల్లో మొదటి స్థానాన్ని కోల్పోయిన ఇండియా తిరిగి దాన్ని నిలబెట్టుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భారత్ తరువాతి రెండు మ్యాచ్ లను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy