4జీ ఎఫెక్ట్ : జియో దెబ్బ అదుర్స్

4gఆల్ ఫ్రీ.. ఆఫర్స్ తో ప్రజల్లోకి వచ్చిన జియో మిగతా నెట్ వర్క్ లకు షాక్ ఇచ్చింది. నెట్ వర్క్ లతో ఈ దెబ్బ ఆగలేదు.. 3జీ ఫోన్ల అమ్మకంపై కూడా భారీగా పడింది. అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) రిలయన్స్ జియో గురించి ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. ముకేశ్ అంబానీ చేసిన పనికి ప్రజలంతా 4జీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. ఇప్పటికీ కూడా జియో ప్రైమ్ ఆఫర్ అమలులో ఉండటంతో 80 శాతం 4జీ ఫోన్లే మార్కెట్ లో ఉన్నాయని.. 3జీ ఫోన్లను పూర్తిగా మర్చిపోయారనే చెప్తున్నారు నిపుణులు. చైనా ఫోన్లు ధర కూడా తక్కువ కావడంతో అందరూ వీటిపైనే పడ్డారు.. ఇక పెట్టుబడులు పెట్టేవారు ప్రాఫిట్స్ తో పండుగ చేసుకుంటున్నారని అంటున్నారు.

One Response to 4జీ ఎఫెక్ట్ : జియో దెబ్బ అదుర్స్

  1. Shiva Reddy says:

    If jio gives 3g sims then this may not happen

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy