400 మైళ్ల అడుగున దాగున్నసముద్రం…?

1402590752000-Jacobsen-Ringwoodite2050 తర్వాత భూ గ్రహం మీద నీటి నిల్వలు బాగా పడిపోతాయనేది ఒక భయంకరమైన నిజం. ఎవరూ ఆపలేని ప్రకృతి వైరిత్యం. అయితే ఏం భయంలేదు భూమిలో నీటి నిల్వలు బోలెడు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. భూమిలో 700 కిలోమీటర్ల అడుగున ఒక భారీ నీటి రిజర్వాయర్ నిక్షిప్తమై ఉందని…అమెరికాలోని నార్త్ వెస్టరన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఎంత అంటే పెద్ద పెద్ద సముద్రాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండేంత నీరు భూమి అడుగున ఉందట. అయితే ఇది లిక్విడ్, ఐస్, ఆవిరి రూపాల్లో కాకుండా…పరమాణు  రూపంలో ఖనిజాలతో రాళ్ళల్లో ఇరుక్కుని ఉందిట. ఎక్కడో 700 కిలోమీటర్ల అడుగున ఉండడం వల్ల దీనిని మనం గుర్తించలేకపోయామని చెబుతున్నారు. ప్రస్తుత సముద్రాలు కూడా భూమి అడుగన నుండి వచ్చినవేనని పూర్వం శాస్త్రజ్ఞులు చెప్పారు. అగ్నిపర్వతాలు, భూకంపాల వల్ల నీటి జాడలు బయటపడుతూనే ఉన్నాయని…అలాగే ఫ్యూచర్ లో ఈ రాక్స్ లో ఉన్న నీరు కూడా బయటపడుతుందని అంటున్నారు నార్త్ వెస్టరన్ యూనివర్శిటీ సైంటిస్టులు.  ప్రస్తుతం తాము కాలిఫోర్నియా పరిధిలోనే పరిశోధన చేశామని ఇంకా భూమి మొత్తం నీటి గురించి పరిశోధన చేయవలసి ఉందని చెబుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy