43 మెక్‌డొనాల్డ్స్‌ మూత

mcdonaldsవిక్రమ్‌ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో 43 మెక్‌డొనాల్డ్స్‌ మూత పడే  పరిస్థితి ఏర్పడింది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్‌ఎల్‌)ను 50:50 జాయింట్‌ వెంచర్‌ లో నిర్వహిస్తున్న విక్రమ్‌ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య తాజాగా వివాదాలు తలేత్తాయి. ఢిల్లీలో నిర్వహిస్తున్న మొత్తం 55 రెస్టారెంట్లలో 43 మూడింటిని మూతవేయాలని సీపీఆర్‌ఎల్‌ బోర్డు నిర్ణయించింది. నేటి(గురువారం) నుంచి ఇవి మూతపడనున్నాయి. సీపీఆర్‌ఎల్‌కు చెందిన 43 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసి వేయాల్సి వస్తుందని సీపీఆర్‌ఎల్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బక్షి చెప్పారు. సీపీఆర్‌ఎల్‌ మొత్తం 168 రెస్టారెంట్లను ఆపరేట్‌ చేస్తోందన్నారు.

బక్షి ప్రస్తుతం మేనేజింగ్‌ డైరెక్టర్‌గా లేనప్పటికీ, ఆయన, తన భార్యతో కలిసి సీపీఆర్‌ఎల్‌లో బోర్డు సభ్యులుగా ఉంటున్నారు. సీపీఆర్‌ఎల్‌ బోర్డులో మెక్‌డొనాల్డ్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులూ ఉన్నారు. కానీ బుధవారం ఉదయం స్కైప్‌ ద్వారా నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌లెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో 1,700 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే మూసివేసే విషయానికి గల ప్రధాన కారణాలను వెల్లడించలేదు ఈ జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి. బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు వివాదం తలెత్తడంతో, సీపీఆర్‌ఎల్‌ కచ్చితంగా చేయాల్సిన రెగ్యులేటరీ హెల్త్‌ లైసెన్సులను కూడా రెన్యువల్‌ చేయించలేదు.  2013 ఆగస్టులో సీపీఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా తొలగించబడ్డ బక్షి, మెక్‌డొనాల్డ్స్‌తో వివాదానికి దిగారు. ఈ విషయంపై కంపెనీ లా బోర్డులో విచారణ కూడా జరుగుతోంది. బక్షికి వ్యతిరేకంగా మెక్‌డొనాల్డ్స్‌ కూడా లండన్‌ కోర్టులో ఆర్బిట్రేషన్‌ దాఖలు చేసింది. నార్త్‌, ఈస్ట్‌ ఇండియాలో మాత్రమే మెక్‌డీలను కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.  సౌత్‌, వెస్ట్‌ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్‌ ఆపరేషన్లను హార్డ్‌ క్యాసిల్‌ రెస్టారెంట్ల ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది. సీపీఆర్‌ఎల్‌ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మెక్‌డొనాల్డ్స్‌కు ప్రమాదకరమని బ్రాండింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy