యాగంలో మహారాష్ట్ర గవర్నర్, ఏపీ స్పీకర్

yaagam (2)మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మూడో రోజు కొనసాగుతోంది అయుత చండీయాగం. ఉదయం గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఉదయం 8.30గంటలకు యాగశాలకు చేరుకున్నారు. గురు ప్రార్థన తర్వాత  గోపూజ నిర్వహించారు సీఎం దంపతులు. సంప్రదాయం ప్రకారం ఈరోజు రుత్విజులు, యాగకర్తలు, నిర్వాహకులు శ్వేతవర్ణం దస్తులు ధరించారు. యాగ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీచక్రం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీశ్‌రావు.

ఇవాళ్టి ప్రత్యేకతలు: గణపతిపూజ, ఏకదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీపారాయణాలు, నవావరణ పూజ, నవగహ్ర హోమం, యోగిని బలి, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి.

యాగంలో మహారాష్ట్ర గవర్నర్, ఏపీ స్పీకర్

మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి యాగంలో పాల్గొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, జోగురామన్న, పోచారం తదితరులు హాజరయ్యారు.

GOVERNER kodela

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy